ఆ విషయం కనుక చెబితే నాకు విడాకులు వస్తాయి.. ప్రియాంక చోప్రా షాకింగ్ కామెంట్స్!

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో విడాకుల పరంపరం కొనసాగుతోంది.ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న ఎంతోమంది వైవాహిక జీవితంలో అన్యోన్యంగా గడుపుతున్నప్పటికీ కొన్ని కారణాలవల్ల ఊహించని విధంగా విడాకుల ప్రకటన చేసే అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తున్నారు.

 Priyanka Chopra Shocking Comments If I Say That Thing I Surly Got Divorce , Priyaka Chopra, Bollywood, Comment, Husband-TeluguStop.com

ఇలా ఇప్పటికే ఎన్నో జంటలు విడాకులు తీసుకొని విడిపోయాయి.అయితే గతంలో ప్రియాంక చోప్రా కూడా విడాకులు తీసుకోబోతోంది అంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.

అయితే ఈ వార్తలపై ప్రియాంక చోప్రా స్పందిస్తూ వార్తలను కొట్టి పారేశారు.

 Priyanka Chopra Shocking Comments If I Say That Thing I Surly Got Divorce , Priyaka Chopra, Bollywood, Comment, Husband-ఆ విషయం కనుక చెబితే నాకు విడాకులు వస్తాయి.. ప్రియాంక చోప్రా షాకింగ్ కామెంట్స్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇదిలా ఉండగా తాజాగా స్వయంగా ప్రియాంక చోప్రా విడాకుల గురించి ప్రస్తావించడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.

బాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్రతారగా కొనసాగుతున్న ఈమె హాలీవుడ్ చిత్రాలను సైతం చేస్తున్నారు.ఈ క్రమంలోనే హాలీవుడ్ పాప్ సింగర్ నిక్ జోనాస్ నుప్రేమించి పెళ్లి చేసుకున్న ఈమె వైవాహిక జీవితం గురించి పలు వ్యాఖ్యలు చేశారు.

అయితే ఈ జంట సరోగసి ద్వారా ఒక బిడ్డకు జన్మనిచ్చారు.ఇకపోతే తాజాగా ఈమె విడాకుల గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రియాంక చోప్రా తాను తన వ్యక్తిగత విషయాల గురించి ఎప్పుడు బయట పెట్టనని వెల్లడించారు.ఈ విషయం గురించి తనని చాలామంది అడుగుతారు అయితే తన వ్యక్తిగత విషయాలు చెప్పకపోవడానికి ఒక కారణం ఉంది.తాను పంజాబీ అమ్మాయి కావడంతో తనకు ఎన్నో సెంటిమెంట్లు ఉన్నాయి.ఇలా నా సెంటిమెంట్ల గురించి నా వ్యక్తిగత విషయాల గురించి బయటకు చెప్పానంటే చాలామంది మా జీవితం పై దిష్టి పెడతారు.

అలా ఇతరుల కన్ను మాపై పడితే మేము కూడా విడాకులతో విడిపోతామేమోనని భయపడి ఆ విషయాల గురించి బయట పెట్టనని ఈ సందర్భంగా ప్రియాంక చోప్రా వెల్లడించారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube