స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా( priyanka chopra ) ఏ విషయం గురించి మాట్లాడినా సోషల్ మీడియాలో వైరల్ అవుతుందనే సంగతి తెలిసిందే.ప్రియాంక చోప్రా ఒకింత బోల్డ్ గా మాట్లాడతారనే విషయం తెలిసిందే.
అయితే తాజాగా ప్రియాంక చోప్రా డేటింగ్ గురించి, ఎఫైర్ల గురించి షాకింగ్ కామెంట్స్ చేయగా ఆ కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.ప్రియాంక చోప్రా మాట్లాడుతూ నేను నిక్ జోనస్( Nick Jonas ) ను కలవడానికి ముందే కొంతమందిని ప్రేమించానని చెప్పారు.

ఒకరితో బ్రేకప్ అయిన వెంటనే మరొకరిని ప్రేమించేదానినని ఆమె అన్నారు.ఆ సమయంలో నేను నటిగా ఎంతో బిజీగా ఉండేదానినని ఒక బంధానికి మరో బంధానికి కూడా నేను పెద్దగా గ్యాప్ ఇవ్వలేదని ప్రియాంక చోప్రా చెప్పుకొచ్చారు.నాతో పని చేసిన వాళ్లతో నేను డేటింగ్ ( Dating )చేసేదానినని ఆమె కామెంట్లు చేశారు.నేను ఎవరితో డేటింగ్ చేశానో వాళ్లంతా అద్భుతమైన వాళ్లు అని ప్రియాంక చోప్రా చెప్పుకొచ్చారు.
నేను డేటింగ్ చేసిన వాళ్లలో కొంతమందితో బంధాలు విషాదంగా ముగిసిపోయాయని ప్రియాంక చోప్రా కామెంట్లు చేశారు.లాస్ట్ బ్రేకప్ తర్వాత మరో బంధంలో అడుగుపెట్టడానికి ఎక్కువ సమయం పట్టిందని ఆమె అన్నారు.
నా ప్రేమలు ఫెయిల్ అయిన తర్వాత నన్ను నేను ప్రశ్నించుకున్నానని ఆ తర్వాత నిక్ జోనస్ తో నాకు పరిచయం ఏర్పడిందని ప్రియాంక చోప్రా పేర్కొన్నారు.

నిక్ జోనస్ నా లవర్ గా మాత్రమే కాకుండా భర్తగా కూడా ప్రమోషన్ పొందాడని నిక్ జోనస్ కూడా పెళ్లికి ముందు చాలామందిని ప్రేమించాడని ఆమె కామెంట్లు( comments ) చేశారు.పెళ్లికి ముందే తనకు, తన భర్తకు ఎఫైర్లు ( Affairs )ఉన్నాయని ప్రియాంక పరోక్షంగా చెప్పుకొచ్చారు.గతం కన్నా భవిష్యత్తు ముఖ్యం అని అనిపించి నిక్ జోనస్ తో జీవితాన్ని కొనసాగించాలని అనుకున్నానని ప్రియాంక చోప్రా వెల్లడించడం గమనార్హం.