ఆస్తులు ఆమ్మేస్తున్న స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా.. కారణమేమిటంటే..?

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా గ్లోబర్ స్టార్ గా పేరును సంపాదించుకున్న సంగతి తెలిసిందే.ఈ బ్యూటీకి దేశంలోని ప్రధాన నగరాల్లో ఆస్తులు ఉన్నాయి.

 Priyanka Chopra Sell Two Apartments Leases Rented Office Deets Inside-TeluguStop.com

ముంబై, గోవాతో పాటు లాస్ ఏంజిల్స్ లో కూడా ప్రియాంక చోప్రా పేరిట ఖరీదైన భవంతులు ఉన్నాయి.అయితే స్టార్ స్టేటస్ ను అందుకున్న హీరోయిన్లు తమ ప్రాపర్టీస్ ను అమ్ముకోవడానికి ఎక్కువగా ఇష్టపడరు.

అయితే ప్రియాంక చోప్రా మాత్రం వరుసగా తన ఆస్తులను అమ్మేస్తుండటం గమనార్హం.ముంబైలో ఉన్న ఆఫీస్ బిల్డింగ్ ను సైతం ఈ బ్యూటీ అద్దెకు ఇస్తున్నారని తెలుస్తోంది.

 Priyanka Chopra Sell Two Apartments Leases Rented Office Deets Inside-ఆస్తులు ఆమ్మేస్తున్న స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా.. కారణమేమిటంటే..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ ఏడాది మార్చి నెలలో 3కోట్ల రూపాయలకు మహారాష్ట్రలోని అంధేరిలో ఉన్న ఫ్లాట్ ను ప్రియాంక చోప్రా అమ్మేశారు.తాజాగా అదే అంతస్తులో ఉన్న మరో ఫ్లాట్ ను సైతం ప్రియాంక చోప్రా 4కోట్ల రూపాయలకు అమ్మేసిన సంగతి తెలిసిందే.

Telugu 211000 Rupees, Bandra Office Building, Bollywood, Goa, Los Angeles, Mumbai, Office Deets, Priyanaka Chopra, Selling Properties, Two Apartments-Movie

రెండు ఫ్లాట్లను అమ్మడం ద్వారా ప్రియాంక చోప్రాకు 7కోట్ల రూపాయల ఆదాయం చేకూరగా ప్రియాంక చోప్రా అద్దెకు ఇచ్చిన భవనం ద్వారా ఆమెకు 2.11 లక్షల రూపాయల ఆదాయం చేకూరనుందని తెలుస్తోంది.ఈ భవనం విస్తీర్ణం 2040 అడుగుల విస్తీర్ణం ఉందని తెలుస్తోంది.ప్రియాంక గతేడాది పిబ్రవరి నెలలో కూడా రెండు కోట్ల రూపాయలకు ఒక అపార్టుమెంట్ ను అమ్మిన సంగతి తెలిసిందే.

Telugu 211000 Rupees, Bandra Office Building, Bollywood, Goa, Los Angeles, Mumbai, Office Deets, Priyanaka Chopra, Selling Properties, Two Apartments-Movie

ప్రియాంక చోప్రాకు లాస్ ఏంజిల్స్ లో 150 కోట్ల రూపాయల విలువ చేసే ఖరీదైన ఇల్లు ఉంది.అయితే ప్రియాంక ఆస్తులు అమ్మాలని నిర్ణయం తీసుకోవడానికి అసలు కారణం తెలియాల్సి ఉంది.రికార్డు స్థాయిలో పారితోషికం తీసుకునే ప్రియాంక చోప్రా ఆస్తులను అమ్ముతుండటం గమనార్హం.మరోవైపు సినిమా ఆఫర్లు ప్రియాంక చోప్రాకు అంతకంతకూ పెరుగుతుండగా కథ నచ్చితే మాత్రమే ప్రియాంక చోప్రా కొత్త సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు.

#Deets #Bandra #Mumbai #Rupees #Aments

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు