దాన్ని మరువ లేకుండా ఉందట!

‘మేరీకోమ్‌’ సినిమా తర్వాత ప్రియాంక చోప్రా నటకు ఆస్కారం ఉన్న పాత్రలు మాత్రమే చేస్తానంటూ భీష్మించుకు కూర్చుంది.‘మేరీకోమ్‌’ సినిమా చేసినందుకు తన జీవితం ధన్యం అయ్యిందంటూ సంతోషాన్ని వ్యక్తం చేస్తోంది.

 Priyanka Chopra Says No To Glamour Roles-TeluguStop.com

ఆ సినిమాలో తన నటనకు విమర్శకుల ప్రశంసలు అందినందుకు చాలా సంతోషించానని, ఆ పాత్రను, ఆ సినిమాను జీవితంలో మరిచి పోనని అంటోంది.తను ఏ కథ విన్నా కూడా ‘మేరీకోమ్‌’ పాత్ర గుర్తుకు వచ్చి, ఆ పాత్రతో పోల్చి చూస్తున్నానని, దాంతో ఆ పాత్రను చేయాలనే ఆసక్తి రావడం లేదని పేర్కొంది.

ఇకపై గ్లామర్‌ పాత్రలకు నో చెప్పి, తన సత్తా చాటే పాత్రల్లో నటించాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.‘మేరీకోమ్‌’కు ముందు ఎన్నో సినిమాల్లో గ్లామర్‌ డాల్‌ పాత్ర పోషించి, బికినీలో కూడా తన అందాలను ప్రేక్షకులకు విందు చేసిన ఈ అమ్మడు ఆ సినిమాతో పూర్తిగా మారిపోయింది.

కాని ఈమె అభిమానులు మాత్రం ఈమె నిర్ణయాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు.గ్లామర్‌ పాత్రలు చేస్తూనే, అలాంటి పాత్రలు వస్తే చేయాలని చెబుతున్నారు.

ఇలా ‘మేరీకోమ్‌’లాంటి పాత్రలే చేస్తానంటూ కెరీర్‌ ముందుకు సాగదు అని కూడా విశ్లేషకులు అంటున్నారు.మరి ప్రియాంక చోప్రా తన మనస్సు మార్చుకుని, మేరీకోమ్‌ పాత్రను మరిచి పోయి మళ్లీ గ్లామర్‌ పాత్రల్లో నటిస్తుందేమో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube