నా పుస్తకం గాసిప్ బ్యాగ్ లా ఉండాలా అంటూ ప్రియాంక చోప్రా ఫైర్?

గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ప్రస్తుతం పలు వెబ్ సిరీస్ సినిమాలతో ఎంత బిజీగా గడుపుతున్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటారు.

 Priyanka Chopra Said Gossip Rag Unfinished Book-TeluguStop.com

ఈ క్రమంలోనే తన భర్తతో కలిసి దిగినటువంటి రొమాంటిక్ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ కొన్నిసార్లు విమర్శల పాలవుతున్నారు.తాజాగా ప్రియాంకా చోప్రా జోనస్ పుస్తకం ‘అన్‌ఫినిష్‌డ్’ ఇప్పటికే విడుదలయి ప్రపంచవ్యాప్తంగా నంబర్ వన్ బెస్ట్ సెల్లర్‌గా నిలిచింది.

ఈ పుస్తకంలో ప్రియాంక చోప్రా తాను ఇండియాలో పెరిగిన రోజుల గురించి, అలాగే అమెరికాలో టీనేజ్ లో గడిపిన సమయంలో, తాను ప్రపంచ సుందరి కిరీటాన్ని దక్కించుకున్న అప్పుడు, బాలీవుడ్ ఎంట్రీ, హాలీవుడ్ ఎంట్రీ, తన జీవితంలోకి నిక్ జోనస్‌తో గ్రాండ్ వెడ్డింగ్ వంటి విషయాల గురించి చాలా ఆసక్తికరమైన విషయాలను ఈ పుస్తకంలో వెల్లడించారు.ఈ క్రమంలోనే తన జీవితంలో జరిగినటువంటి కొన్ని సంఘటనలను కూడా ఇందులో తెలుపుతూ వాటికి కారణమైన వారి పేర్లను వెల్లడించలేదు.

 Priyanka Chopra Said Gossip Rag Unfinished Book-నా పుస్తకం గాసిప్ బ్యాగ్ లా ఉండాలా అంటూ ప్రియాంక చోప్రా ఫైర్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

దీంతో ఈ విషయం కాస్తా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.ఈ పుస్తకం చదివిన నెటిజన్లు పేరును మెన్షన్ చేయకుండా ఇష్యూ గురించి మాత్రమే తెలియజేయడంతో నెటిజన్లు తీవ్రస్థాయిలో విమర్శిస్తున్నారు.తాజాగా ఓ లిటరరీ ఫెస్టివల్‌లో వీటిపై రియాక్ట్ అయిన ఆమె.ఇది కేవలం తన స్టోరీ మాత్రమే.ఇతరుల కథ కాదు.కొందరు నిజాలు చెప్పడం లేదంటూ విమర్శించడం ఎంతో ఫన్నీగా ఉంది అంటూ.అంటే తన పై ఈ విధంగా విమర్శలు చేసే వారికి తన బుక్ మొత్తం ఒక గాసిప్ బ్యాగ్ లా ఉండాలనీ కోరుకుంటున్నారా.అంటూ నెటిజన్లను ప్రశ్నించింది.

మొత్తానికి ప్రియాంక చోప్రా ఈ పుస్తకం ద్వారా నెటిజన్ల చేతిలో దారుణంగా విమర్శల పాలవుతున్నారని చెప్పవచ్చు.

#Gossip Rag #PriyankaChopra #Priyaka Chopra #Heroine #PriyankaChopra

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు