పడకగది ముచ్చట్లు పంచుకున్న ప్రియాంక చోప్రా  

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా తిరుగులేని ఇమేజ్ సొంతం చేసుకొని ఇప్పుడు హాలీవుడ్ లో అడుగుపెట్టి తన హవా చూపించడానికి రెడీ అవుతున్న అందాల భామ ప్రియాంక చోప్రా.ఈ అమ్మడు హాలీవుడ్ నటుడు, గాయకుడు నిక్కీ జోనస్ ని పెళ్లి చేసుకున్న తర్వాత యూకేలో సెటిల్ అయిపొయింది.

TeluguStop.com - Priyanka Chopra Reveals Her Bedroom Secret

అక్కడే ఉంటూ హాలీవుడ్ సినిమాలు చేస్తుంది.ప్రస్తుతం ఆమె చేతిలో మూడు హాలీవుడ్ ప్రాజెక్ట్ లు ఉన్నాయి.

ఇండియన్ సినిమాలు అంటే కేవలం హీరోయిన్ పాత్రలే చేయాలి.అయితే హాలీవుడ్ లో హీరో, హీరోయిన్ అని ఉండరు.

TeluguStop.com - పడకగది ముచ్చట్లు పంచుకున్న ప్రియాంక చోప్రా-General-Telugu-Telugu Tollywood Photo Image

అన్ని పాత్రలకి సమాన ప్రాధాన్యత ఉంటుంది.ఈ నేపధ్యంలో ప్రియాంక చోప్రా ప్రస్తుతం టెక్స్ట్ ఫర్ యు అనే సినిమాలో నటిస్తుంది.

దీంతో పాటు మరో సినిమా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతుంది.

ఇదిలా ఉంటే తాజాగా ప్రియాంక చోప్రా నిక్కీతో తన బెడ్ సీక్రెట్స్ గురించి ఆసక్తికర విషయాలని మీడియాతో పంచుకుంది.నిక్ సూపర్ స్వీట్ కానీ అతనికి కొంచెం ఇబ్బందికరమైన అలవాటు ఉంది.నేను మేల్కొన్నప్పుడు నా ముఖం చూడాలని అతను పట్టుబడుతుంటాడు.

అంత వరకైతే బాగానే ఉంటుంది కానీ నేను నిద్రలో వుండగా నా ముఖం చూడాలని నిక్ ఆశపడుతుంటాడు.ఆ సమయంలో నేను ముఖానికి మాయిశ్చరైజ్ చేసుకొని ఉంటా అయినా కూడా నిద్ర మత్తులో ఉన్న నా ముఖాన్ని తాను చూడాలనుకుంటాడు.

అందుకే నిక్ అంటే నాకు చాలా ఇష్టం.ఓ భర్త నుంచి ప్రతీ వైఫ్ కోరుకునేది ఇదే.తనని అంతగా ఇష్టపడే భర్త దొరికినపుడు ఈ భార్యకి అయినా ఆనందమే కదా అని ప్రియాంక చోప్రా నిక్కీతో తన బెడ్ రూమ్ అనుభవాలని సరదాగా షేర్ చేసింది

.

#Indian Beauties #Bedroom Secret #Nick Jonas #Priyanka Chopra #Hollywood

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు