ఈ సారి ఆస్కార్ అవార్డుల రేసులోకి ప్రియాంకా చోప్రా?  

Priyanka Chopra Oscars Awards race in 2021, Hollywood, Indian Cinema, The White Tiger, Priyanka Chopra, Bollywood - Telugu Bollywood, Hollywood, Indian Cinema, Priyanka Chopra, Priyanka Chopra Oscars Awards Race In 2021, The White Tiger

బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్న నటి ప్రియాంకా చోప్రా.ప్రపంచ సుందరిగా అందాల కిరీటం సొంతం చేసుకొని బాలీవుడ్ లో తెరంగేట్రం చేసిన ఈ భామతరువాత వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేకుండా స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది.

TeluguStop.com - Priyanka Chopra Oscars Awards Race In 2021

ఇక ప్రియాంకా తన ప్రయాణంలో కేవలం బాలీవుడ్ తోనే ఆగిపోకుండా హాలీవుడ్ రేంజ్ కి దూసుకుపోయింది.ముందుగా హాలీవుడ్ లో వెబ్ సిరీస్ లు చేసి తరువాత సినిమాలు కూడా చేయడం మొదలు పెట్టింది.

హాలీవుడ్ లో అవకాశాలు పెరగడంతో హిందీ సినిమాలు పూర్తిగా తగ్గించేసింది.ప్రస్తుతం ఇండియాలోనే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్న నటిగా ప్రియాంకా చోప్రా గుర్తింపు తెచ్చుకుంది.

TeluguStop.com - ఈ సారి ఆస్కార్ అవార్డుల రేసులోకి ప్రియాంకా చోప్రా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

స్టార్ హీరోలతో సమానంగా ఈ భామ రెమ్యునరేషన్ తీసుకుంటుంది.ఇదిలా ఉంటే ప్రియాంకా చోప్రా తన కెరియర్ లో మరో మైలురాయిని అందుకునేలా ఉందని తాజాగా ఆమె నటించిన హాలీవుడ్ సినిమా చూసిన వారు అంటున్నారు.
ప్రఖ్యాత హాలీవుడ్ మ్యాగజైన్ కవర్ స్టోరి ప్రకారం వచ్చే ఏడాది ప్రారంభంలో 93వ అకాడమీ అవార్డులలో ఉత్తమ సహాయ నటిగా ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డును గెలుచుకునే హాట్ ఫేవరెట్స్ జాబితాలో ప్రియాంక చోప్రా ఒకరిగా ఉంటారని తెలుస్తోంది.ప్రియాంక చోప్రా నటించిన హాలీవుడ్ చిత్రం ది వైట్ టైగర్ ఈసారి ఆస్కార్ రేసులో ఉంటుంది.

ఇందులో పీసీ నటన విమర్శకులను జ్యూరీ సభ్యులను ఆకట్టుకోవడం ఖాయం అన్న చర్చా మొదలైంది.వైట్ టైగర్ సినిమాని ప్రఖ్యాత భారతీయ రచయిత అరవింద్ అడిగా రాసిన నవల ఆధారంగా తెరకెక్కించారు.

ఈ చిత్రానికి హాలీవుడ్ ఫిలిం మేకర్ రామిన్ బహ్రానీ దర్శకత్వం వహించారు.ఈ సినిమా నేరుగా ఓటీటీ ద్వారా రిలీజ్ కానుంది.ఇక ఈ సినిమాలో ప్రియాంకా చోప్రా పెర్ఫార్మెన్స్ కి ఆస్కార్ అందుకోవడం గ్యారెంటీ అనే మాట వినిపిస్తుంది.

#Hollywood #The White Tiger #Priyanka Chopra #PriyankaChopra

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Priyanka Chopra Oscars Awards Race In 2021 Related Telugu News,Photos/Pics,Images..