ఇంకా ఇరవై ఏళ్ళు దాటని వయసులోనే స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమాలో బికిని వేసి అందరిని ఆశ్చర్యపరిచింది ఆలియా భట్.తొలి సినిమా కదా ఆమత్రం ఊపు ఉంటుందిలే అనుకున్నారంతా.
మొన్నాటికిమొన్నా షాందార్ లో మళ్లీ బికిని వేసింది.సినిమాల వరకే ఆగకుండా ఈ మధ్య ఫోటోషూట్స్ లో కూడా బికినిలో దర్శనమిస్తోంది ఆలియా.
దాంతో బాలివుడ్ లో బికిని బాడి అంటే ఆలియాదే అని కితాబిచ్చేస్తున్నారు బాలివుడ్ జనాలు.
ఇప్పుడు ప్రియాంక చోప్రాకి బికిని బాడి ఎలా సాధించాలో టిప్స్ కావాలంట.
వేరే ఎవరినో అడగడం ఎందుకు… డైరెక్టుగా ఆలియా భట్ నే అడిగేసింది ప్రియాంక.బికిని టిప్స్ కావాలని అడగడంతోపాటు “హాట్టీ” అనే కితాబు కూడా ఆలియాకి ఇచ్చేసింది ప్రియాంక.
ఎంతైనా ఉత్తరాది భామలు మామూలు బోల్డుగా ఉండరు.బికిని టిప్స్ కావాలని పబ్లిక్ లో కూడా మొహమాటం లేకుండా అడిగేస్తున్నారు.
ఇప్పుడు ప్రియాంక హాలివుడ్ హీరోయిన్ కదా … ఆ పోకడలు బాగా అలవాటు అయిపోయాయి అమ్మడుకి.