మేకప్ లేకుండా ప్రియాంక చోప్రా.. అవాక్కైన నెటిజన్లు..?

మాజీ ప్రపంచ సుందరిగా ప్రపంచవ్యాప్తంగా తనకంటూ గుర్తింపుతో పాటు ప్రియాంక చోప్రా మంచి పేరును సంపాదించుకున్నారు.మోడల్ గా కెరీర్ ప్రారంభించిన కొద్ది సమయంలోనే ప్రపంచ సుందరి కిరీటం ప్రియాంక చోప్రా సొంతమైంది.

 Priyanka Chopra Make Up Less Photo Goes Viral In Social Media-TeluguStop.com

కోలీవుడ్ ఇండస్ట్రీలో తమిళన్ అనే సినిమాతో నటిగా కెరీర్ మొదలుపెట్టిన ప్రియాంకకు బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు వచ్చింది.

ఐత్రాజ్ అనే సినిమాలో ప్రియాంక క్రిటిక్స్ నుంచి కూడా నటనకు ప్రశంసలను అందుకున్నారు.

 Priyanka Chopra Make Up Less Photo Goes Viral In Social Media-మేకప్ లేకుండా ప్రియాంక చోప్రా.. అవాక్కైన నెటిజన్లు..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

హృతిక్ రోషన్ కు జోడీగా ప్రియాంక చోప్రా క్రిష్ అనే సినిమాలో నటించగా ఆ సినిమాగా కమర్షియల్ గా కూడా సక్సెస్ సాధించింది.రెండు సంవత్సరాల క్రితం ప్రియాంక పాప్ సింగర్ నిక్ జోనస్ ను వివాహం చేసుకున్నారు.

అయితే తాజాగా సోషల్ మీడియాలో ప్రియాంకకు సంబంధించిన ఒక ఫోటో వైరల్ అవుతోంది.

Telugu Goes Viral, Makeup Less Photo, Pop Singer Nick Jonas, Priyanka Chopra, Priyanka Chopra Makeup Less, Priyanka Chopra Viral Photo, Priyanka Chopra Without Makeup, Social Media-Movie

ఆ ఫోటోలో ప్రియాంకా చోప్రా మేకప్ లేకుండా ఉండటం గమనార్హం.ప్రియాంక మేకప్ లేకుండా దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా ఆ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.మేకప్ లేకుండా కూడా ప్రియాంక చోప్రా అందంగానే కనిపిస్తున్నారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

మరోవైపు గ్లోబర్ స్టార్ గా గుర్తింపును సంపాదించుకున్న ప్రియాంక చోప్రా చేతిలో వరుస ఆఫర్లు ఉన్నాయి.

ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే ప్రియాంక చోప్రా యాడ్స్ లో కూడా నటించారు.

ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే పలు సినిమాలకు ప్రియాంక చోప్రా నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు.ప్రస్తుతం ప్రియాంక వైట్ టైగర్, మ్యాట్రిక్స్, టెక్స్ట్ ఫర్ యు సినిమాలలో నటిస్తున్నారు.

ఈ సినిమాలతో పాటు ప్రియాంక చోప్రా చేతిలో మరికొన్ని సినిమాలు కూడా ఉన్నాయి.పెళ్లి తర్వాత ప్రియాంక చోప్రా సినిమాల ఎంపిక విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

నటనకు ప్రాధాన్యత ఉన్న సినిమాలను ప్రియాంక చోప్రా ఎక్కువగా ఎంచుకుంటున్నారు.

#PopSinger #PriyankaChopra #PriyankaChopra #Goes Viral #Social Media

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు