హాలీవుడ్ మూడో సినిమాకి సైన్ చేసిన ప్రియాంకా చోప్రా  

Priyanka Chopra Jonas to star in a new Hollywood, Bollywood, Indian Cinema, South Cinema, Text For You, Priyanka Chopra Jonas - Telugu Bollywood, Hollywood, Indian Cinema, Priyanka Chopra, Priyanka Chopra Jonas, Priyanka Chopra Jonas To Star In A New Hollywood, South Cinema, Text For You

బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్న విశ్వ సుందరి ప్రియాంకా చోప్రా.అందాల కిరీటం సొంతం చేసుకున్న తర్వాత బాలీవుడ్ లోకి అడుగుపెట్టి వరుస సినిమాలతో తిరుగులేని హీరోయిన్ గా ఎదిగింది.

TeluguStop.com - Priyanka Chopra Jonas To Star In A New Hollywood

ప్రస్తుతం బాలీవుడ్ అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్ గా ఉంది.అయితే ఈ అమ్మడు హాలీవుడ్ యాక్టర్ ని పెళ్లి చేసుకున్న తర్వాత ఇండియన్ సినిమాలు చాలా వరకు తగ్గించేసింది.

ఎక్కువగా హాలీవుడ్ సినిమాల మీదనే ఫోకస్ చేస్తుంది.బేవాచ్ సినిమాతో హాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ తరువాత హాలీవుడ్ వెబ్ సిరీస్, సినిమాల మీద ఫోకస్ పెట్టింది.

TeluguStop.com - హాలీవుడ్ మూడో సినిమాకి సైన్ చేసిన ప్రియాంకా చోప్రా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

ఇప్పటికే ప్రియాంకా చోప్రా ది మ్యాట్రిక్స్ 4లో కీలక పాత్రలో నటిస్తుంది.అలాగే ది వైట్ టైగర్ సినిమాలో కూడా చేస్తుంది.

ఈ రెండు ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్నాయి.

ఇదిలా ఉంటే ప్రియాంకా చోప్రా మరో హాలీవుడ్ సినిమాలో మెయిన్ హీరోయిన్ పాత్రకి ఎంపికైంది.

జ‌ర్మ‌నీలో రిలీజైన ఎస్ఎంఎస్ ఫ‌ర్ డిచ్ చిత్రాన్ని హాలీవుడ్‌లో రిమేక్ చేస్తున్నారు.ఆ ఫిల్మ్‌లో ప్రియాంకాని ఫైనల్ చేశారు.టెక్ట్స్ ఫ‌ర్ యూ పేరుతో ఈ సినిమా హాలీవుడ్ లో తెరకెక్కబోతుంది.ఈ విషయాన్ని ప్రియాంకా అఫీషియల్ గా ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా కన్ఫర్మ్ చేసింది.

త‌న‌తో న‌టించే కో-స్టార్ల పేర్ల‌ను కూడా ప్రియాంకా తెలియజేసింది.గ్రామీ విన్న‌ర్ సెలిన్ డియాన్‌, హీరో సామ్ హూగ‌న్ కూడా ఈ ఫిల్మ్‌లో న‌టించ‌నున్నారు.

అసాధార‌ణ‌ న‌టీన‌టుల‌తో క‌లిసి న‌టించే అవ‌కాశం రావ‌డం అద్భుతంగా ఉంటుంద‌ని ప్రియాంకా కామెంట్ చేసింది.రొమాంటిక్ డ్రామాగా ఈ మూవీని తెర‌కెక్కించ‌నున్నారు.

జిమ్ స్ట్రౌజ్ ఈ చిత్రాన్ని డైర‌క్ట్ చేస్తున్నారు.

#PriyankaChopra #Priyanka Chopra #Text For You #Hollywood #PriyankaChopra

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Priyanka Chopra Jonas To Star In A New Hollywood Related Telugu News,Photos/Pics,Images..