మీమ్స్ క్రియేటర్స్ కి కావాల్సినంత సరుకు ఇచ్చిన ప్రియాంకా చోప్రా

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో మీమ్స్ భాగా ఎక్కువయ్యాయి.వీటిని చూసి ఆశ్వాదించే వారు ఎక్కువగా ఉండటంతో వీటికి మంచి డిమాండ్ ఏర్పడింది.

 Actress Priyanka Chopra Has Shared Several Fan Made Memes, Social Media, Bollywo-TeluguStop.com

ఇక ఈ మీమ్స్ రూపంలోనే చాలా మంది సెలబ్రిటీలు తమ సినిమాలని ప్రమోట్ చేసుకుంటున్నారు.సోషల్ మీడియాలో పదుల వందల సంఖ్యలో ఉన్న మీమ్స్ పేజీలలో ప్రతి రోజు ఆసక్తి కలిగించే ఎన్నో సెటైరికల్ మీమ్స్ వస్తూ ఉంటాయి.

ఒకప్పుడు పత్రికలలో కార్టూన్స్ ఎంతగా ఫేమస్ అయ్యాయో ఇప్పుడు సోషల్ మీడియాలో మీమ్స్ అంతే పాపులర్ అవుతున్నాయి.ముఖ్యంగా రాజకీయాలు, సోషల్, సినిమా ప్రపంచానికి సంబంధించి ఎక్కువగా మీమ్స్ వైరల్ అవుతూ ఉంటాయి.

సెలబ్రిటీలని లక్ష్యంగా చేసుకొని రకరకాల మీమ్స్ తో ఈ క్రియేటర్స్ రెచ్చిపోతూ ఉంటారు.అలా వారు క్రియేట్ చేసే ఫన్నీ మీమ్స్ ఒక్కోసారి వివాదాస్పదంగా మారితే ఒక్కోసారి మాత్రం సెలబ్రిటీలకి కూడా కాస్తా ఆనందాన్ని అందిస్తాయి.

అవి తమ మీద ట్రోల్ అయిన మీమ్స్ అయిన వాటిని సరదాగా తీసుకొని సెలబ్రిటీలు తిరిగి షేర్ చేస్తూ ఉంటారు.

ఇప్పుడు బాలీవుడ్ బ్యూటీ ప్రియాంకా చోప్రా కూడా తన మీద క్రియేట్ చేసిన మీమ్స్ ని షేర్ చేసి ఆనందాన్ని పంచుకుంది.

రీసెంట్ గా ఓ ఫోటో షూట్ కోసం ప్రియాంకా బుట్టలా ఉండే డ్రెస్ ఒకటి వేసుకొని ఫోటోలకి ఫోజులు ఇచ్చింది.వీటిని ఈ భామ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసుకుంది.

ఇక ఆమె కాస్ట్యూమ్ కాస్తా ఫన్నీగా ఉండటం నెటిజన్లు తెగ మీమ్స్ క్రియేట్ చేసేశారు.ఇవి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ మంచి ఫన్ క్రియేట్ చేస్తున్నాయి.

దీంతో చాలా మంది వాటిని షేర్ చేసుకుంటున్నారు.ఈ నేపధ్యంలో ప్రియాంకా చోప్రా కూడా తన కాస్ట్యూమ్ మీద వచ్చిన మీమ్స్ ని షేర్ చేసింది.

దీంతో అవి మరింత వైరల్ గా మారాయి.అయితే తన మీద వచ్చిన మీమ్స్ చూసి ఆమె కూడా నవ్వుకుంటున్నట్లు కామెంట్ చేయడం విశేషం.

Telugu Bollywood, Fan Memes, Memes, Netizens, Priyanka Chopra-Movie.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube