యునెసెఫ్ అవార్డు సొంతం చేసుకున్న బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా ప్రస్తుతం హాలీవుడ్ సినిమాల్లో కూడా నటిస్తూ ఇంటర్నేషనల్ హీరోయిన్ గా మారిపోయింది.ప్రస్తుతం హాలీవుడ్ లో రెండు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది.

 Priyanka Chopra Got Unicef Award-TeluguStop.com

ఈ భామ ఇప్పుడు మరో అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకుంది.ఐక్యరాజ్యసమితిలో అందించే యూనిసెఫ్ అమెరికా డానీ కేయి మానవతా పురస్కారానికి ఎంపికయ్యింది.

బాలల విద్య, సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నందుకుగాను ప్రియాంక చోప్రా ని ఈ అవార్డు కి ఐక్యరాజ్యసమితి ఎంపిక చేసింది.

ఈ సంవత్సరం ఆఖర్లో ఈ పురస్కారాన్ని ఆమె అందుకోబోతుంది.

ఇక తనకి లభించిన ఈ అరుదైన గౌరవంపై ప్రియాంక చోప్రా ట్విట్టర్ వేదికగా అభిమానులతో పంచుకొని తన ఆనందాన్ని వ్యక్తం చేసింది.మొత్తానికి స్టార్ హీరోయిన్ గా ఓ వైపు తన అందంతో అందర్నీ ఆకట్టుకునే తన వ్యక్తిత్వంతో సేవా కార్యక్రమాలతో, మహిళల కోసం బాలల హక్కుల కోసం ప్రియాంక చోప్రా చేస్తున్న సేవకి ఇప్పుడు సరైన గుర్తింపు వచ్చిందని ఆమె సన్నిహితులు చెబుతున్నారు.

ప్రస్తుతం ఈ భామ హాలీవుడ్ లో రెండు సినిమాలు.హిందీలో ఒక సినిమా నటిస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube