నీతులు చెప్పే ముందు మనం కూడా పాటించాలి ప్రియాంకా! నెటిజన్స్ కామెంట్  

Priyanka Chopra Gets Brutally Trolled By Netizens For Smoking-hollywood,priyanka Chopra Gets Brutally Trolled. Netizens. Smoking

ఫ్రీ గా వస్తున్నాయి కదా సమాజంలో ప్రతి ఒక్కరు పక్కోడిని నీతులు చెప్పేవారే. ఏది మంచి, ఏది చెడు, ఏది చేయకూడదు, ఏది చేయాలి అనే విషయాల మీద వినేవాడు ఉంటే గంటల కొద్ది స్పీచ్ లు ఇచ్చేస్తూ ఉంటారు. ఈ విషయంలో సెలబ్రిటీలు కూడా అతీతులు కాదు..

నీతులు చెప్పే ముందు మనం కూడా పాటించాలి ప్రియాంకా! నెటిజన్స్ కామెంట్-Priyanka Chopra Gets Brutally Trolled By Netizens For Smoking

సోషల్ మీడియాలో అందరికి నీతులు చెప్పే ముందు వారు ఎంత వరకు పాటిస్తున్నారో అనే విషయం తెలుసుకోకపోతే అసలుకె మోసం వస్తుంది. ఏదో ఒక రోజు అడ్డంగా బుక్ అయ్యి అందరి చేత చివాట్లు తింటారు. ఇప్పుడు ప్రియాంకా చోప్రా పరిస్థితి కూడా అలాగే అయ్యింది.

హాలీవుడ్ లో ఈ మధ్య అవకాశాలు అందుకుంటున్న ఈ బాలీవుడ్ భామ గతంలో దీపావళికి తాపసులు పేల్చడాన్ని తీవ్రంగా తప్పు పట్టింది. నా లాంటి ఆస్తమా ఉన్నవారికి ఈ క్రాకర్స్ ప్రాణాంతకం అని ఆమె ట్వీట్ చేసింది. నా రోగం గురించి నేను ధైర్యంగా చెప్పుగోలను అని బోల్డ్ స్టేట్ మెంట్ కూడా ఇచ్చుకుంది.

ప్రియాంకా మంచి మాట చెప్పింది కదా అని వినే లోపే ఈ అమ్మడు తన పెళ్లి వేడుకలో భారీ ఎత్తున క్రాకర్స్ పేల్చింది. అక్కడ ఈ భామకి తన రోగం గురించి గుర్తురాలేదా అని అప్పట్లోనే చాలా మంది కామెంట్స్ చేసారు. అలాగే మరో సారి సిగరెట్టా… యాక్ అని, అది కాల్చితే ప్రమాదం అంటూ కామెంట్స్ చేసింది. అయితే తాజాగా సిగరెట్ తాగుతూ ఈ భామ అడ్డంగా పట్టుబడింది.

ఇక ఇదే అవకాశం అని నెటిజన్లు ఆమెని ఒక ఆట అడేసుకుంటున్నారు. నీతులు చెప్పే ముందు మనం కూడా కచ్చితంగా ఫాలో అవ్వాలి అనే విషయం ప్రియాంకా మరిచిపోయింది అని, ఆమె కాలుస్తుంది పతంజలి సిగరెట్స్ అని రకరకాల కామెంట్స్ పెట్టారు.