భర్త నిక్ కు అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చిన ప్రియాంక చోప్రా!

బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ , గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.స్టార్ హీరోయిన్ గా ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించి ఎంతో ప్రేక్షకాదరణ సంపాదించుకున్న ఈమె ఓ వైపు సినీ జీవితంలో ఎంతో బిజీగా ఉండటమే కాకుండా తన వైవాహిక జీవితంలో కూడా ఎంతో సంతోషంగా గడుపుతుందని చెప్పవచ్చు.

 Priyanka Chopra Surprise Gift To Husband Nick Jonas, Priyanka Chopra , Nick Jona-TeluguStop.com

ప్రియాంక చోప్రా అమెరికన్ పాప్ సింగర్ నిక్ జోనస్ ను పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.వీరిద్దరి మధ్య ఎంత అన్యోన్యత ఉందో మనకు పలు సందర్భాలలో తెలియజేశారు.

ఈ జంట ఎక్కువగా పర్యాటక ప్రదేశాలను చుట్టుముట్టడమే కాకుండా ఏ సందర్భంలోనైనా ఇద్దరూ జంటగా కలిసి చేసే రచ్చ మామూలుగా ఉండదు.పబ్లిక్ గానే ఈ జంట ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమను వ్యక్త పరుస్తూ ఎంతో రొమాంటిక్ ఫోటోలకు ఫోజులిస్తూ ఆ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటారు.

ఈ క్రమంలోనే ప్రస్తుతం ప్రియాంక చోప్రా “సిటాడెల్” సినిమా షూటింగ్ లో భాగంగా లండన్‌లో బిజీగా ఉన్నారు.ఈ క్రమంలోనే నిక్ జోనాస్ తన సోదరులతో కలిసి ఆశక్తికరమైన పర్యటనను ప్రారంభించడానికి సిద్ధం కాగా తన భార్య ప్రియాంక చోప్రా నుంచి తన భర్తకు సర్ ప్రైస్ ఇస్తూ ఒక కేక్ పంపించారు.

Telugu Bollywood, Nick Jonas, Nickjonas, Priyanka Chopra, Priyankachopra, Sweet

ఈ క్రమంలోనే నిక్ జోనాస్ ఈ కేక్ ఫోటోను ఇంస్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా అభిమానులతో పంచుకోవడమే కాకుండా, తన భార్యను ఎంతలా మిస్ అవుతున్నాడో తెలియజేశాడు.ఈ క్రమంలోనే ఈ ఫోటో ను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ.“థాంక్యూ ప్రియాంక చోప్రా.యు ఆర్ ది బెస్ట్” అంటూ క్యాప్షన్ ఇచ్చారు.

ఇక సినిమాల విషయానికి వస్తే ప్రియాంక చోప్రా సిటాడెల్’ కాకుండా ‘టెక్స్ట్ ఫర్ యు’, ‘మ్యాట్రిక్స్ 4’ లో కూడా నటిస్తున్నారు.అదేవిధంగా అలియా భట్, కత్రినాకైఫ్, ప్రియాంక ముగ్గురు కలిసి ఫర్హాన్ అక్తర్ దర్శకత్వంలో ‘జీ లే జరా’ సినిమాలో నటించనున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube