అలా చేయకపోతే గ్యాంగ్ రేప్ చేస్తామంటూ స్టార్ హీరోయిన్ కి బెదిరింపులు.. కానీ...

సినిమా రంగం అనేది యూనివర్సల్.ఇందులో భాగంగా నటీనటులు ఏ బాష, దేశానికి చెందినప్పటికీ ప్రపంచంలో తమ నటనా ప్రతిభను ఎక్కడైనా సరే నిరూపించుకునే నటించే అవకాశం ఉంటుంది.

 Priyanka Chopra Facing Abusive Comments In America-TeluguStop.com

ఈ క్రమంలో కొందరు నటీనటులు అసభ్యకర సంఘటనలను ఎదుర్కొంటుంటారు.అయితే బాలీవుడ్ లోనే కాకుండా పలు హాలీవుడ్ చిత్రాలలో కూడా నటించి తన నటనా ప్రతిభతో ప్రేక్షకులను ఎంతగానో అలరించిన ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ “ప్రియాంక చోప్రా” గురించి దేశ వ్యాప్తంగా తెలియనివారుండరు.

అయితే ఇటీవలే ప్రియాంక చోప్రా తన వ్యక్తిగత జీవితంలోనే కాకుండా, సినీ జీవితంలో జరిగినటువంటి పలు సంఘటనలను పొందుపరుస్తూ “అన్ ఫినిష్డ్” అనే పుస్తకాన్ని విడుదల చేసిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ పుస్తకంలో ప్రియాంక చోప్రా అమెరికాలో తాను జాతి వివక్షను ఎదుర్కున్నానని తెలిపింది.

 Priyanka Chopra Facing Abusive Comments In America-అలా చేయకపోతే గ్యాంగ్ రేప్ చేస్తామంటూ స్టార్ హీరోయిన్ కి బెదిరింపులు.. కానీ…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

 అంతేకాక తాను విడుదల చేసిన ఆల్బమ్ మంచి విజయం సాధించడంతో ఎంతో మంది తనకు ప్రశంసలు తెలిపారని, కానీ కొందరు మాత్రం ఏకంగా ఈ దేశాన్ని వదిలి పెట్టి వెళ్ళిపో…  లేకపోతే నీపై సామూహిక అత్యాచారం చేస్తామంటూ బెదిరించినట్లు కూడా ప్రియాంక చోప్రా పుస్తకంలో తెలిపింది.

దీంతో ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ వైరల్ అవుతోంది.

మరికొందరు నెటిజనులు ఈ విషయంపై స్పందిస్తూ ఒక్కోసారి మన జీవితంలో కొన్ని క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుందని అంతమాత్రాన నడవడం ఆపేస్తే అక్కడితోనే ఆగిపోతామని ఇవన్నీ పట్టించుకోకుండా ముందుకు సాగితే మంచి భవిష్యత్తు ఉంటుందంటూ తమ మద్దతును తెలియజేస్తున్నారు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా పెళ్లయిన తర్వాత ప్రియాంక చోప్రా సినిమాల పరంగా కొంత మేర తగ్గించినట్లు తెలుస్తోంది.

ఇటీవలే ప్రియాంక చోప్రా బాలీవుడ్ ప్రముఖ హీరో రాజ్ కుమార్ రావు తో కలిసి “ది వైట్ టైగర్” అనే చిత్రంలో హీరోయిన్ గా నటించింది. కానీ ఈ చిత్రం ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.

 దీంతో ప్రియాంక చోప్రా తన తదుపరి చిత్ర కథల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తోంది.

#UnFinished #Priyanka Chopra #PriyankaChopra #Abuse Comments

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు