బట్టలు విప్పి నటించమన్న దర్శకుడు... సినిమా వదిలేసుకున్న ప్రియాంకా చోప్రా

ఇండస్ట్రీలో హీరోయిన్స్ అవ్వాలనే కలలతో చాలా మంది అమ్మాయిలు అడుగుపెడుతూ ఉంటారు.అయితే వారిలో కొంత మంది మాత్రమే సక్సెస్ అందుకొని స్టార్స్ గా ఎదురుతారు.

 Priyanka Chopra Face Harassment In Career Starting Stage, Bollywood, Indian Cine-TeluguStop.com

కొంత మంది అలా వచ్చి కొన్ని సినిమాలలో కనిపించి, తరువాత కనుమరుగవుతారు.అయితే సినిమా ఇండస్ట్రీలో అందాల భామలకి వేగంగా సక్సెస్ అందుకోగలరని చాలా మంది భావిస్తారు.

హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వాలని అనుకుంటుంది అంటే కచ్చితంగా అన్నింటికీ రెడీ అయ్యి ఉంటుందని బయట వ్యక్తులు భావిస్తారు.సినిమా ఇండస్ట్రీలో ఆడవాళ్ళపై లైంగిక వేధింపులు ఆ రకంగా ఉంటాయి కాబట్టి.

వాటిని తట్టుకోగలమని అనుకునే వారు అనుకునేవారు, అన్నింటికీ రెడీ అయ్యేవారు హీరోయిన్స్ గా సక్సెస్ కాగలరని అనుకుంటారు.సక్సెస్ అయినా హీరోయిన్స్ విషయంలో కూడా ఇలాంటి కామెంట్స్ వినిపిస్తూ ఉంటాయి.

అన్నింటికీ రెడీగా ఉంటేనే సక్సెస్ వస్తుంది.ఒద్దికగా ఉంటూ నేను అలా చేయను, ఇలా చేయను అని బెట్టు చేస్తే అవకాశాలు రావనే అభిప్రాయం చాలా మంది సక్సెస్ కాని హీరోయిన్స్ లో కూడా ఉంది.

ముఖ్యంగా తెలుగమ్మాయిలు హీరోయిన్స్ గా సక్సెస్ కాకపోవడానికి దర్శకులు చెప్పినట్లు అర్ధనగ్నంగా నటించకపోవడం, వాళ్ళు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్ళకపోవడమే కారణం అని అంటూ ఉంటారు.అయితే కెరియర్ ఆరంభంలో ప్రతి హీరోయిన్ కి వేధింపులు సాధారణమే అయినా ఒక్కసారి సక్సెస్ వచ్చిన తర్వాత దర్శక, నిర్మాతలు ఎవరూ వారిని స్టార్స్ గా ట్రీట్ చేస్తారు తప్ప లైంగికంగా వేధించే ప్రయత్నం చేశారు.

ప్రస్తుతం హాలీవుడ్ లో దూసుకుపోతున్న ఇండియన్ స్టార్ హీరోయిన్ ప్రియాంకా చోప్రాకి కూడా ఇలాంటి వేధింపులు ఎదురయ్యాయని ఒఫ్రా విన్ ఫ్రే షోలో చెప్పుకొచ్చింది.కెరియర్ ఆరంభంలో ఓ దర్శకుడు ఒంటిపై బట్టు లేకుండా కేవలం అండర్ వేర్ మీద డాన్స్ చేయమని చెప్పాడు.

ఆ ఆఫర్ తనకి అవసరం లేదని దర్శకుడికి చెప్పి వచ్చేశాను.అప్పుడు ఇండస్ట్రీకి కొత్త కాబట్టి దర్శకుడి పేరు బయట పెట్టలేకపోయా.అవకాశాలు రావేమో అనే భయంతో సైలెంట్ గా ఉండిపోయా అని చెప్పుకొచ్చింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube