ప్రియాంక చోప్రా సోషల్ మీడియాలో ఒక్క పోస్ట్ కు ఎంత సంపాదిస్తుందంటే …!  

Priyanka Chopra Earns two crores per Instagram Post, Priyanka Chopra ,Priyanka Chopra Instagram, Remuneration, Amazon Prime Video - Telugu Amazon Prime Video, Priyanka Chopra, Priyanka Chopra Earns Two Crores Per Instagram Post, Priyanka Chopra Instagram, Remuneration

భారతీయ అందం మాజీ విశ్వసుందరి ప్రియాంక చోప్రా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ప్రపంచ వ్యాప్తంగా ఆమె ఎంత పాపులర్ నటో అందరికీ తెలిసిన విషయమే.

 Priyanka Chopra Earns 2crores Per Instagram Post

బాలీవుడ్ లోని మాత్రమే కాకుండా హాలీవుడ్ లో కూడా తనదైన ముద్ర వేసుకున్న నటి ప్రియాంక చోప్రా.అమెరికన్ పాప్ సింగర్ నిక్ జోనస్ ను సంవత్సరంపాటు ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈమె లాస్ ఏంజిల్స్ లో కాపురం పెట్టేసింది.

ఇక ఈ పాప్ సింగర్ ను పెళ్లి చేసుకున్న తర్వాత ఈ అమ్మడికి మామూలు పాపులారిటీ పెరగలేదు.ప్రపంచవ్యాప్తంగా ప్రియాంక చోప్రా పేరు మార్మోగిపోయింది.

ప్రియాంక చోప్రా సోషల్ మీడియాలో ఒక్క పోస్ట్ కు ఎంత సంపాదిస్తుందంటే …-Movie-Telugu Tollywood Photo Image

అయితే ప్రస్తుతం ప్రియాంక చోప్రా కు తన ఇన్స్టాగ్రామ్ లో ఏకంగా ఐదున్నర కోట్లకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు.

అయితే స్టార్ డం ఉన్న నటీనటులు చాలామంది ఒక్కొక్కసారి పెయిడ్ పోస్టులను వారి ఖాతాలో పోస్ట్ చేస్తూ ఉంటారు.

ఇందుకుగాను వారు తీసుకునే పారితోషకం గురించి వింటే నిజంగా గుండె ఆగినంత పనవుతుంది.అయితే ఇదే వరుసలో ప్రియంక చోప్రా ఒక్క ప్రమోషన్ పోస్టుకు ఏకంగా రెండు కోట్ల రూపాయల వరకు తీసుకుంటోందని తెలుస్తోంది.

ఈ విధంగా భారత నటీనటుల్లో ఈవిడ మొదటి స్థానం.ఈ విధంగా ప్రపంచంలో ఇన్స్టాగ్రామ్ ద్వారా అత్యధిక సొమ్మును సంపాదించే వ్యక్తులలో ఈవిడ 28వ స్థానాన్ని పొందింది.

అలాగే తాజాగా ప్రియాంక చోప్రా సినీ కెరీర్ సంగతి చూస్తే… ఆవిడ అమెజాన్ ప్రైమ్ తో భారీ ఒప్పందాన్ని కుదుర్చుకుంది.రెండు సంవత్సరాల పాటు కొనసాగే ఈ కాంట్రాక్ట్ పరంగా ఆవిడ వందలాది కోట్లల లో ఒప్పందాన్ని కుదుర్చుకుంది.

ఇందుకుగాను హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ఆమె నటించబోతోంది.ఈ విషయంపై ఆమె స్పందిస్తూ… తాము నిర్మించే షోలతో మరింత భారతీయతను పెంపొందిస్తాయని తెలిపింది.

#Remuneration #Priyanka Chopra

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Priyanka Chopra Earns 2crores Per Instagram Post Related Telugu News,Photos/Pics,Images..