బాలీవుడ్ బ్యూటీకి ఆ అర్హత లేదేమో..?

సినీ ఇండస్ట్రీలో నటీనటులకు సోషల్ మీడియా నుండి ఎన్నో విమర్శలు ఎదురవుతుంటాయి.వాళ్లు ఏదైనా తమకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను అభిమానులతో పంచుకోవడం లేదా ఏదైనా విషయం గురించి మాట్లాడినప్పుడు నెటి జనుల నుండి తీవ్రమైన విమర్శలు ఎదురవుతాయి.

 Priyanka Chopra Befitting Reply Journalist-TeluguStop.com

ఇక ఈ విమర్శలు గురించి కొందరు నటులు స్పందించకపోగా.మరికొందరు వాటికి తగ్గట్టుగా జవాబు ఇస్తారు.

అంతేకాకుండా నొప్పించకుండా ఆ విమర్శలకు కౌంటర్ వేస్తుంటారు.

 Priyanka Chopra Befitting Reply Journalist-బాలీవుడ్ బ్యూటీకి ఆ అర్హత లేదేమో..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇదిలా ఉంటే తాజాగా అలాంటి విమర్శలే ఓ బాలీవుడ్ బ్యూటీ ఎదుర్కొంది.

ఇంతకీ ఆమె ఎవరో కాదు బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా.ప్రియాంక చోప్రా సోషల్ మీడియాలో తెగ బిజీగా ఉంటుంది.

అంతేకాకుండా ఆమె షేర్ చేసిన ఫోటోలకు విమర్శలు ఎదురవగా అవతల వారిని నొప్పించకుండా ఘాటైన సమాధానం తో స్పందిస్తుంది.తాజాగా ఆమెకు ఎదురైన విషయం పట్ల ఈ విధంగానే స్పందించింది ప్రియాంక.

తాజాగా సోమవారం 93వ ఆస్కార్ అవార్డుల నామినేషన్ జాబితా లో ప్రియాంక చోప్రా తన భర్త నిక్ జోనస్ తో కలసి ప్రకటించింది.ఇక వీరిద్దరి ప్రకటన గురించి ఆస్ట్రేలియన్ జర్నలిస్ట్.’ ఈ ఇద్దరంటే నాకు గౌరవ భావం లేదనను.కానీ సినిమా రంగానికి వాళ్ల కంట్రిబ్యూషన్ ఆస్కార్ నామినేషన్లను ప్రకటించినంత అర్హత ఇస్తుందని నేను అనుకోవడం లేదు’ అంటూ ప్రియాంక, నిక్ ల ఉద్దేశంతో తెలిపింది.

ఇక ఈ విషయాన్ని స్పందించిన ప్రియాంక చోప్రా.’ ఒకరి అర్హతను నిర్ణయించేవి ఏంటి? అనే మీ ఆలోచనను స్వాగతిస్తున్నాను.అయితే 60కి పైగా నేను చేసిన సినిమాల జాబితాను మీ కోసం ఇక్కడ ఇస్తున్నాను’ అంటూ తనదైన శైలిలో సుతిమెత్తగా సమాధానమిచ్చింది.ఇక ఇది చూసిన నెటిజనులు చాలా కూల్ గా జవాబు ఇచ్చావు ప్రియాంక అంటూ కామెంట్లు చేస్తున్నారు

.

#Reply #Oscar Awards #Priyanka Chopra #Journalist #Oscar Awards

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు