ప్రియాంక, నిక్కీ జొనస్ పెళ్లి పెటాకులేనా! సంచలనాలు వెల్లడించిన ఇంగ్లీష్ మ్యాగజైన్

బాలీవుడ్ ముద్దుగుమ్మ స్టార్ హీరోయిన్ ప్రియాంకా చోప్రా గత ఏడాది హాలీవుడ్ నటుడు, సింగర్ నిక్కీ జొనస్ ని వివాహం చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే.వారి పెళ్లై ఇప్పటికి ఏడాది కూడా తిరగకుండానే ఇప్పుడు వీళ్ళిద్దరూ విడాకులకి రెడీ అవుతున్నారా అంటే అవుననే మాట ఇప్పుడు వినిపిస్తుంది.

 Priyanka Chopra And Nick Jonas Headed For A Divorce-TeluguStop.com

వాళ్ళిద్దరి విడిపోతున్నారు అనేది వాస్తవం అనేది ఓ అమెరికన్ మ్యాగజైన్ రీసెంట్ గా ఓ కథనాన్ని ప్రచురించింది.అందులో ప్రియాంక, నిక్ దాంపత్య జీవితం అంత సాఫీగా ఏం సాగడం లేదని చెప్పుకొచ్చింది.

ఇద్దరి మధ్య గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి అని, త్వరలో విడాకులు తీసుకోవడానికి కూడా సిద్ధం అవుతున్నారని ఆ ఆంగ్ల మ్యాగజైన్ లో రాసుకొచ్చారు.

నిక్కీ ఫ్యామిలీ కూడా ప్రియాంకాతో రిలేషన్ బ్రేక్ చేసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారని అందులో సారాంశం.

పెళ్లికి ముందు నిక్కీ జీవితం చాలా సాఫీగా సాగిపోయేదని, అయితే పెళ్లి తర్వాత ప్రియాంక పెత్తనం ఎక్కువ కావడంతో ఇద్దరి మధ్య తీవ్ర మనస్పర్ధలు వచ్చినట్లు మ్యాగజైన్ లో రాసింది.ఇద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకోకుండానే పెళ్లి చేసుకున్నారని ఈ కారణంగా ప్రియాంకాతో నిక్కీ విడాకులకి సిద్ధం అవుతున్నాడని తెలుస్తుంది.

అయితే ఈ వార్తలలో నిజం లేదని, కావాలనే ప్రియాంకా, నిక్కీల రిలేషన్ భరించలేక ఇలాంటి రాతలు రాస్తున్నారని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube