ఆ రెండు సినిమాల విజయాలు ఆ హీరోయిన్ కి కలిసొచ్చినట్లేనా.. దశ తిరిగినట్టేనా?

ప్రియాంక అరుళ్ మోహన్ ఈ బ్యూటీ గురించి మనందరికీ తెలిసిందే.చెన్నైకి చెందిన ఈ ముద్దుగుమ్మ నటనపై ఉన్న ఆసక్తితో మొదటిసారిగా 2019 లో ఒంద్ కథే హెళ్ల కన్నడ సినిమాతో సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది.

 Priyanka Arul Mohan Movie Offers With Don And Varun Doctor Hits Details, Priyanka Arul Mohan,tollywood, Dan Movie, Kollywood, Heroine Priyanka Arul Mohan, Priyanka Arul Mohan Movie Offer, Shiva Karthikeyan,dhanush, Don Movie, Varun Doctor Movie-TeluguStop.com

ఆ తర్వాత టాలీవుడ్ హీరో నేచురల్ స్టార్ నాని నటించిన గ్యాంగ్ లీడర్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.అయితే ఈ సినిమా ఊహించిన విధంగా విజయం సాధించలేక పోయినప్పటికీ ప్రియాంక కు మాత్రం మంచి గుర్తింపు దక్కింది.

ఫిదా సినిమాలో తన అందం అభినయంతో ప్రేక్షకులను కట్టి పడేసి యూత్ లో భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది.

 Priyanka Arul Mohan Movie Offers With Don And Varun Doctor Hits Details, Priyanka Arul Mohan,tollywood, Dan Movie, Kollywood, Heroine Priyanka Arul Mohan, Priyanka Arul Mohan Movie Offer, Shiva Karthikeyan,dhanush, Don Movie, Varun Doctor Movie-ఆ రెండు సినిమాల విజయాలు ఆ హీరోయిన్ కి కలిసొచ్చినట్లేనా.. దశ తిరిగినట్టేనా-,Top Story-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఆతర్వాత శర్వానంద్ హీరోగా నటించిన శ్రీకారం సినిమాలో కూడా నటించింది.

ఆ సినిమా కూడా ఊహించని విధంగా డిజాస్టర్ కావడంతో కోలీవుడ్ కి చెక్కేసి అక్కడ హీరో శివ కార్తికేయన్ తో కలిసి డాక్టర్ సినిమాను చేసింది.ఈ సినిమా తెలుగులో వరుణ్ డాక్టర్ పేరుతో రిలీజ్ అయిన విషయం తెలిసిందే.

ఈ సినిమా విడుదల అయి మంచి విజయం సాధించింది.ఈ సినిమాతో తొలి హిట్ టాక్ ను తన ఖాతాలో వేసుకుంది ఈ ముద్దుగుమ్మ.

ఆ తర్వాత హీరో సూర్య తో కలసి ఈటి సినిమాల్లో నటించినప్పటికీ ఆ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.

ఇకపోతే ఇటీవలే విడుదలైన డాన్ సినిమా తో ప్రేక్షకులను పలకరించింది ఈ ముద్దుగుమ్మ.

ఈ సినిమా తెలుగులో కాలేజీ డాన్ పేరుతో విడుదలైన విషయం తెలిసిందే.ఎటువంటి అంచనాలు లేకుండా ఈ సినిమా మే 13న విడుదల అయి బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది.అంతేకాకుండా ఈ మధ్యకాలంలో భారీ వసూళ్లు రాబట్టిన సినిమాల్లో ఈ సినిమా ఒకటి గా నిలిచింది.అలా మొత్తానికి శివకార్తికేయన్ ద్వారా రెండు హిట్స్ అందుకున్న ప్రియాంక దశ తిరిగినట్లేనా అని అంటున్నారు.

రెండు సినిమాల తర్వాత ఆమెకు ప్రస్తుతం కోలీవుడ్ లో వరుసగా సినిమా ఆఫర్లు వస్తున్నాయట.ఈ క్రమంలోనే కోలీవుడ్ స్టార్ హీరో అయిన ధనుష్ తో కూడా ఒక ప్రాజెక్టు ఓకే చేసినట్లు తెలుస్తోంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube