నేచురల్ స్టార్ నాని నటించిన ‘గ్యాంగ్‌లీడర్’ చిత్రం గురించి అందరికీ తెలిసిందే.ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకోగా, ఆ సినిమాలో నటించిన ప్రియాంక ఆరుల్ మోహన్ టాలీవుడ్‌కు హీరోయిన్గా పరిచయమైంది.
అయితే ఈ సినిమా తరువాత మరే ఇతర సినిమాలో నటించలేదు.దీంతో ఆమె కెరీర్ ఇలా వచ్చి అలా ముగిసిందని చాలా మంది అనుకున్నారు.
అయితే అందరినీ అవాక్కయ్యేలా చేస్తూ అమ్మడు యంగ్ హీరో శర్వానంద్ నటిస్తున్న శ్రీకారం చిత్రంలో హీరోయిన్ ఛాన్స్ కొట్టేసింది.
ఇక ఈ సినిమాను ప్రస్తుతం రిలీజ్‌కు రెడీ చేశారు చిత్ర యూనిట్.
ఈ సినిమాలోని పోస్టర్స్‌లో ప్రియాంక అందంగా కనిపిస్తుండటంతో ఈ సినిమాను త్వరగా చూసేయాలని ప్రేక్షకులు కోరుతున్నారు.ఇక ఈ సినిమా రిలీజ్ కాకముందే మరో అద్భుతమైన ఛాన్స్ కొట్టేసింది ఈ బ్యూటీ.
తమిళ స్టార్ హీరో సూర్య నటించబోయే ఓ సినిమాలో హీరోయిన్గా ప్రియాంక ఆరుల్ మోహన్‌ను సెలెక్ట్ అయినట్లు తెలుస్తోంది.తమిళ దర్శకుడు పాండిరాజ్ డైరెక్షన్లో సూర్య నటించబోయే సినిమాలో ప్రియాంకకు హీరోయిన్ ఛాన్స్ వచ్చినట్లు కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి.
ఏదేమైనా ఈ సినిమా ఛాన్స్ అమ్మడికి పెద్ద విషయమనే చెప్పాలి.ఇప్పటివరకు స్టార్ హీరోలతో చేసే ఛాన్స్ రాకపోవడంతో, సూర్య లాంటి వెర్సటైల్ యాక్టర్‌తో కలిసి చేసేందుకు ఎంతో ఆసక్తిగా ఉందట ఈ బ్యూటీ.
మరి సూర్య సరసన ఎలాంటి పాత్రలో ఈ బ్యూటీ కనిపిస్తుందా అనే ఆసక్తి అప్పుడే తమిళ ప్రేక్షకుల్లో నెలకొంది.ఇక ఈ సినిమాను సన్ పిక్చర్స్ బ్యానర్ అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కించేందుకు రెడీ అవుతుండగా, వచ్చే నెలలో ఈ సినిమాను పట్టాలెక్కించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.
కాగా సూర్య ఇటీవల ఆకాశమే నీ హద్దురా చిత్రంతో అదిరిపోయే హిట్ అందుకున్నాడు.