నిఖిల్ 18 పేజెస్ కోసం తెరపైకి వచ్చిన నాని హీరోయిన్

యంగ్ హీరో నిఖిల్ హీరోగా సుకుమార్ ప్రొడక్షన్ లో సుకుమార్ అందించిన కథతోనే కుమారి 21ఫేం పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో 18 పేజెస్ సినిమా ఇప్పటికే కన్ఫర్మ్ అయిన సంగతి తెలిసిందే.ఇక ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో స్టార్ట్ కావాల్సి ఉన్న కరోనా పరిస్థితుల కారణంగా వాయిదా పడిపోయింది.

 Priyanka Arul Mohan Heroine For 18 Pages Movie, Tollywood, 18 Pages Movie, Sukum-TeluguStop.com

త్వరలో ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకొని వెళ్ళడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుంది.దీనికి రంగం సిద్ధం చేసుకుంది.

ఇక ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర గురించి ఎప్పటికప్పుడు ఒక్కో పేరు మారుతూ వస్తుంది.ముందుగా ఈ సినిమా కోసం లావణ్య త్రిపాఠి పేరు వినిపించింది.తరువాత అనుపమ పరమేశ్వరన్ పేరు గట్టిగా వినిపించింది.18 పేజెస్ హీరోయిన్ గా అనుపమ కన్ఫర్మ్ అయిపోయినట్లు ప్రచారం జరిగింది.అది దానిపై చిత్ర యూనిట్ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.

ఇప్పడు మరో హీరోయిన్ పేరు తెరపైకి వచ్చింది.

నాని గ్యాంగ్ లీడర్ సినిమాలో హీరోయిన్ గా నటించిన ప్రియాంకా ఆరుళ్ మోహన్ 18 పేజెస్ హీరోయిన్ గా దాదాపు ఖరారు అయ్యిందని చెప్పుకుంటున్నారు.ఈ అమ్మడు ఇప్పటికే మలయాళీ, తమిళ సినిమాలలో నటిస్తూ నటిగా ప్రూవ్ చేసుకొని దూసుకుపోతుంది.

అయితే నాని గ్యాంగ్ లీడర్ సినిమాలో ఈమె హీరోయిన్ గా చేసిన పెద్దగా ప్రాధాన్యత లేని పాత్ర కావడం, ఆపై సినిమా కూడా డిజాస్టర్ కావడంతో ప్రియాంకా ని అందరూ పట్టించుకోవడం మానేశారు.అయితే చాలా గ్యాప్ తర్వాత మరల 18 పేజెస్ లో హీరోయిన్ గా ఈ అమ్మడుని కన్ఫర్మ్ చేసినట్లు టాక్ నడుస్తుంది.

ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ ఉంటారని, అందులో ఒక హీరోయిన్ గా ప్రియాంకా కనిపిస్తుందని మరో ప్రచారం కూడా ఉంది.మరి వీటిలో వాస్తవం ఎంత అనేది తెలియాలంటే చిత్ర యూనిట్ అధికారికంగా కన్ఫర్మ్ చేసేంత వరకు వేచి చూడాలి.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube