మహేష్ బాబుతో రొమాన్స్ చేయబోతున్న గ్యాంగ్ లీడర్ భామ

నాని గ్యాంగ్ లీడర్ సినిమాతో టాలీవుడ్ లో హెరొఈనె గా ఎంట్రీ ఇచ్చిన అందాల భామ ప్రియాంకా ఆరుళ్ మోహన్.ఈ అమ్మడు ప్రస్తుతం శర్వానంద్ శ్రీకారం సినిమాలో నటిస్తుంది.ఈ సినిమా రిలీజ్ కి రెడీ అవుతుంది.మరో వైపు టాలీవుడ్ దర్శకుల చూపు ప్రియాంకా ఆరుళ్ మీద పడినట్లు తెలుస్తుంది.ఇక రవితేజ, త్రినాధ్ రావు నక్కిన సినిమా కోసం ప్రియాంకా ఆరుళ్ మోహన్ ని ఫైనల్ చేసినట్లు తెలుస్తుంది.దీంతో పాటు మరో ఇద్దరు యంగ్ హీరోలతో ఈ అమ్మడు రొమాన్స్ చేయబోతుంది.

 Priyanka Arul Got Chance To Romance With Mahesh Babu-TeluguStop.com

హెవీ గ్లామర్ గా కనిపించకపోయిన ట్రెడిషనల్ లుక్ లోనే ఈ అమ్మడు దర్శకులని మెస్మరైజ్ చేస్తూ అవకాశాలు అందుకుంటుంది.ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ భామకి సంబంధించి మరో హాట్ న్యూస్ టాలీవుడ్ లో వినిపిస్తుంది.

సక్సెస్ ఫుల్ దర్శకుడు అనిల్ రావిపూడి ప్రస్తుతం ఎఫ్3 సినిమా తెరకెక్కిస్తున్నాడు.దీని తర్వాత మళ్ళీ సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేయబోతున్నాడు.

 Priyanka Arul Got Chance To Romance With Mahesh Babu-మహేష్ బాబుతో రొమాన్స్ చేయబోతున్న గ్యాంగ్ లీడర్ భామ-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇప్పటికే ఆయనకి స్టొరీ కూడా చెప్పడం జరిగిందని, అతను ఒకే చెప్పాడని టాక్ నడుస్తుంది.ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా ప్రియాంకా ఆరుళ్ మోహన్ ని ఫైనల్ చేసే పనిలో అనిల్ రావిపూడి ఉన్నాడని చెప్పుకుంటున్నారు.

ఇప్పటికే ఈ అమ్మడుకి స్టొరీలైన్ కూడా చెప్పడం జరిగిందని బోగట్టా.సూపర్ స్టార్ మహేష్ బాబుతో రొమాన్స్ చేసే అవకాశం అనగానే ఈ భామ ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఒకే చెప్పెసిందనే మాట వినిపిస్తుంది.

ఇక దీని గురించి ఒకే సారి అధికారికంగా కన్ఫర్మ్ చేసే అవకాశం ఉందని టాక్.మరి మహేష్ బాబుతో నటించే అవకాశం ప్రియాంకా సొంతం చేసుకుంటే ఇక ఈ అమ్మడు కూడా కీర్తి సురేష్, రష్మిక, పూజా హెగ్డే తరహాలో స్టార్ హీరోయిన్స్ కేటగిరీలోకి చేరిపోతుందని టాలీవుడ్ లో వినిపిస్తున్న మాట.

#Mahesh Babu #PriyankaArul #Anil Ravipudi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు