మలయాళంలో ప్రసంగించిన న్యూజిలాండ్ మంత్రి

పరాయి గడ్డపై అడుగుపెట్టినా మూలాల్ని మరిచిపోని వ్యక్తులు కొందరుంటారు.జీవితంలో ఎంత ఎత్తుకు ఎదిగినా కన్నతల్లిని, జన్మభూమిని వీరు గుండెల్లో దాచుకుని పది మందికి ఆదర్శంగా నిలుస్తుంటారు.

 New Zealand's First Indian-origin Minister Priyanca Radhakrishnan, Addressed Par-TeluguStop.com

అలాంటి కోవలోకే వస్తారు భారత సంతతికి చెందిన ప్రియాంక రాధాకృష్ణన్.అక్టోబర్ 17న జరిగిన న్యూజిలాండ్ ఎన్నికల్లో ప్రధాని జెసిండా ఆర్డెర్న్ నేతృత్వంలోని లేబర్ పార్టీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.

గతంలో వివిధ పార్టీలతో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసి జెసిండా.ప్రస్తుతం ఒంటరిగానే అధికారం చేపట్టారు.

ఈ క్రమంలో తన క్యాబినెట్‌లో తొలిసారి భారత సంతతి వ్యక్తికి అవకాశం కల్పించారు జెసిండా.ఆమె ఎవరో కాదు ప్రియాంక రాధాకృష్ణన్.

డైవర్సిటీ, ఇన్‌క్లూజన్, ఎథినిక్ కమ్యూనిటీ శాఖ మంత్రిగా, సామాజిక అభివృద్ధి, ఉద్యోగ కల్పన సహాయ మంత్రిగా బాధ్యతలను ప్రియాంకకు అప్పగించారు.ఈ సందర్భంగా ఆమె పార్లమెంట్‌లో తన మాతృభాష మలయాళంలోనే ప్రసగించడం విశేషం.

దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.ఈ వీడియో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి హర్‌దీప్ సింగ్ పూరి ట్విట్టర్‌లో షేర్ చేశారు.

భారత సంతతికి చెందిన న్యూజిలాండ్ మంత్రి ప్రియాంక ఆ దేశ పార్లమెంట్‌లో మలయాళంలో ప్రసగించడం భారత్ గర్విస్తోంది’అని ఆయన పేర్కొన్నారు.

పార్లమెంట్‌లో ప్రసగించిన తర్వాత ప్రియాంక మాట్లాడుతూ.

న్యూజిలాండ్ పార్లమెంట్‌లో నా మాతృభాష మలయాళం మాట్లాడటం ఇదే తొలిసారని వ్యాఖ్యానించారు.మలయాళంలో మాట్లాడానికి ఆమె ఇబ్బంది పడినా.

మాతృభాషలో ప్రసంగించడానికి ఆమె చేసిన ప్రయత్నాన్ని అందరు అభినందిస్తున్నారు.ప్రియాంక రాధాకృష్ణన్‌ పూర్వీకులు భారత్‌లోని కేరళ రాష్ట్రానికి చెందినవారు.

తండ్రి ఆర్ రాధాకృష్ణన్‌ స్వస్థలం ఎర్నాకులం.ఇక, ప్రియాంక సింగ్‌పూర్‌లో విద్యాభ్యాసం పూర్తిచేసి ఉన్నత విద్య కోసం న్యూజిలాండ్ వెళ్లారు.

అక్కడే ఆమె ఉద్యోగంలో స్థిరపడ్డారు.గృహహింస ఎదుర్కొంటున్న మహిళలు, వలస కార్మికుల సమస్యలపై ప్రియాంక గతంలో పనిచేశారు.2006లో లేబర్ పార్టీలో చేరిన ప్రియాంక.2017 ఎన్నికల్లో పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube