రియల్ కామ్రేడ్‌తో భారతక్క ట్రెయినింగ్.. మామూలుగా లేదట!

టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న ఆసక్తికరమైన సినిమాల్లో విరాటపర్వం కూడా ఒకటి.ఈ సినిమాను వేణు ఉడుగుల డైరెక్ట్ చేస్తుండగా రానా దగ్గుబాటి ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు.

 Priyamani Training With Real Naxalite, Priyamani, Naxalite, Bharatakka, Viratapa-TeluguStop.com

అయితే ఈ సినిమా నక్సల్స్ బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కుతుండటంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లోనూ మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.ఇక ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో ప్రియమణి నటిస్తున్న సంగతి తెలిసిందే.

కామ్రేడ్ భారతక్క అనే పాత్రలో ప్రియమణి నటిస్తోన్న సంగతి తెలిసిందే.అయితే ఈ పాత్రలో నటించేందుకు ఆమె నిజంగానే ఓ కామ్రేడ్ దగ్గర ట్రెయినింగ్ తీసుకున్నట్లు తెలుస్తోంది.

అయితే లాక్‌డౌన్‌కు ముందే ఓ మాజీ నక్సల్ దగ్గర ప్రియమణి ఇలాంటి ట్రెయినింగ్ తీసుకుందని, అందుకే భారతక్క పాత్రను చాలా సులువుగా చేయగలుగుతోందని తెలుస్తోంది.ఓ సినిమాలో తన పాత్ర కోసం ఇంతలా కష్టపడుతున్న ప్రియమణిని చూసి చిత్ర యూనిట్ సెల్యూట్ కొడుతోంది.

కాగా ఈ సినిమాలో రానా కూడా నక్సల్ పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది.ఫిదా బ్యూటీ సాయి పల్లవి ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోండగా ఇండస్ట్రీ వర్గాల్లో ఈ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.

ఇక అవార్డ్ విన్నింగ్ నటి నందితా దాస్ ఈ సినిమాలో మరో కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్ ప్రొడ్యూస్ చేస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube