పాన్ ఇండియా రేంజ్ లో లేడీ ఒరియాంటెడ్ సినిమా చేస్తున్న ప్రియమణి

ఒకప్పుడు సౌత్ లో స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న నటి ప్రియమణి.తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళీ బాషలలో గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తూ వచ్చిన ప్రియమణి ఇటు నటనతో, అటు గ్లామర్ తో అందరి హృదయాల్ని కొల్లగొట్టింది.

 Priyamani Signed Pan India Movie, Pan India Movies, Narappa Movie, Virataparvam-TeluguStop.com

తెలుగులో యమదొంగ సినిమా ప్రియమణిని స్టార్ హీరోయిన్ గా మార్చేసింది.అవకాశాలు బాగా ఉన్న సమయంలోనే ఈ భామ తాను ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకొని కొత్త జీవితం స్టార్ట్ చేసింది.

తరువాత సినిమాలకి కొంత గ్యాప్ ఇచ్చి మళ్ళీ రీస్టార్ట్ చేసింది.ఇక సొంత బాష అయిన కన్నడలో ఇప్పటికి హీరోయిన్ గా సినిమాలు చేస్తున్న ప్రియమణి తెలుగు, తమిళ బాషలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, మరో వైపు సీనియర్ హీరోలకి జోడీగా నటించడానికి రెడీ అయ్యింది.

ప్రస్తుతం ఈ భామ ది ఫ్యామిలీ మెన్ అనే వెబ్ సిరీస్ తో పాటు, విరాటపర్వంలో కామ్రేడ్ విమలక్క అనే పాత్రలో నటిస్తుంది.అలాగే నారప్ప సినిమాలో వెంకటేష్ కి జోడీగా ఇద్దరు కొడుకుల తల్లిగా కనిపించబోతుంది.

ఈ సినిమాలో ఆమె పాత్ర కూడా చాలా కీలకంగా ఉంటుంది.ఇదిలా ఉంటే ఇప్పుడు ప్రియమణి లీడ్ రోల్ లో ఓ లేడీ ఒరియాంటెడ్ సినిమాకి రంగం సిద్ధమైంది.

అది కూడా పాన్ ఇండియా రేంజ్ లో సౌత్ భాషలతో పాటు హిందీలో కూడా ఈ సినిమా తెరకెక్కుతుంది.కొటేషన్‌ గ్యాంగ్‌ అనే టైటిల్‌తో ఈ సినిమా తెరకెక్కబోతుంది.

బాలా దగ్గర అసోసియేట్‌గా పనిచేసిన వివేక్.కె ఈ చిత్రంతో దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు.

మొత్తానికి ప్రియమణి పెళ్లి తర్వాత కూడా వరుసగా మంచి కథలు ఎంచుకుంటూ క్రేజ్ ని మరింత పెంచుకునే ప్రయత్నం చేస్తుంది.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube