అతడికి జూనియర్ లారెన్స్‌ అంటూ పేరు పెట్టిన ప్రియమణి

తెలుగు బుల్లి తెర ప్రేక్షకులకు డాన్స్ షో అనేగానే గుర్తుకు వచ్చే పేరు ఢీ.ఈటీవీలో ప్రసారం అవుతున్న ఈ ఢీ ప్రస్తుతం 13వ సీజన్ కొనసాగుతోంది.

 Priyamani Says Dance Manikanta Looks Like Raghava Lawrence-TeluguStop.com

కింగ్స్ వర్సెస్‌ క్వీన్స్ గా కొనసాగుతున్న ఈ సీజన్‌ కూడా అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.అయితే ఈ సీజన్‌ కు మద్యలో శేఖర్‌ మాస్టర్ తప్పుకోవడంతో ప్రియమణి మరియు పూర్ణలు గెస్ట్‌ జడ్జ్‌ తో కొనసాగిస్తున్నారు.

ఈ సీజన్‌ లో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న డాన్సర్‌ మణికంఠ.ఈయన డాన్స్ తీరుకు ప్రేక్షకులు మరియు తోటి కంటెస్టెంట్స్ కూడా ఫిదా అవుతూ ఉంటారు.

 Priyamani Says Dance Manikanta Looks Like Raghava Lawrence-అతడికి జూనియర్ లారెన్స్‌ అంటూ పేరు పెట్టిన ప్రియమణి-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక ప్రియమణి ఎక్కువగా మణికంఠ పై ప్రశంసలు కురిపిస్తూ ఉంటారు.వచ్చే వారం ఎపిసోడ్‌ కు సంబంధించిన ప్రోమో ఇటీవల యూట్యూబ్‌ లో పోస్ట్‌ చేశారు.

ఆ వీడియో అదిరిపోయింది.ముఖ్యంగా మణికంఠ డాన్స్‌ పెర్ఫార్మెన్స్ అదిరి పోయింది అంటూ కామెంట్స్ వస్తున్నాయి.

బుల్లి తెరపై ఇప్పటి వరకు ఎంతో మంది డాన్సర్స్ వచ్చారు.వారందరిలో మణికంఠ స్పెషల్‌ అంటూ ప్రేక్షకులు అంటున్నారు.తాజాగా ప్రియమణి కూడా అద్బుతంగా డాన్స్ చేశావ్‌ మణికంఠ అంటూ ప్రశంసలు కురిపించింది.జూనియర్ లారెన్స్‌ మాస్టర్‌ అంటూ మణికంఠకు పేరు పెట్టింది.

లారెన్స్ మాస్టర్‌ ను చూస్తున్నట్లుగా అనిపిస్తుంది అంటూ మణికంఠను ప్రియమణి ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి.ప్రేక్షకుల మరియు ఇతర కంటెస్టెంట్స్ అంతా కూడా నిజంగానే మణికంఠ ఆ రేంజ్‌ కు వెళ్తాడంటూ అభినందనలు తెలియజేస్తున్నారు.

ఇక ప్రతి వారం మాదిరిగానే వచ్చే బుదవారం ఎపిసోడ్‌ కు సంబంధించి ప్రదీప్ హంగామా హడావుడి కనిపిస్తుంది. ఢీ లో ప్రదీప్ తో సుడిగాలి సుధీర్‌ మరియు హైపర ఆది చేసే కామెడీ అందరిని ఆకట్టుకుంటూ ఉంది.

ఇక రష్మి గౌతమ్ మరియు దీప్తి పిల్లిల గ్లామర్ షో కు అదనపు ఆకర్షణగా నిలుస్తున్నాయి అనడంలో సందేహం లేదు.

#Dhee 13 #Dance Show

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు