బరువు పెరగడంతో అలా అన్నారు.. ప్రియమణి ఘాటు వ్యాఖ్యలు..?

ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా వినియోగం పెరగడంతో నెటిజన్లు సెలబ్రిటీల విషయంలో తమ అభిప్రాయాలను నేరుగా పంచుకుంటున్నారు.సోషల్ మీడియా వల్ల సెలబ్రిటీలు, ప్రేక్షకులకు మధ్య దూరం తగ్గిపోవడం గమనార్హం.

 Priyamani Reveals That She Has Been Fat Shamed And Revealed Some Personal Secrets Too-TeluguStop.com

నటులతో ఫ్యాన్స్ డైరెక్ట్ గా కాంటాక్ట్ అయ్యే అవకాశం ఉండటంతో కొంతమంది సెలబ్రిటీలు అభిమానుల సలహాలు, సూచనలను సైతం పాటిస్తున్నారు.

ఎవరే అతగాడు సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన ప్రియమణి పెళ్లైన కొత్తలో సినిమాతో టాలీవుడ్ లో సక్సెస్ ను సొంతం చేసుకున్నారు.

 Priyamani Reveals That She Has Been Fat Shamed And Revealed Some Personal Secrets Too-బరువు పెరగడంతో అలా అన్నారు.. ప్రియమణి ఘాటు వ్యాఖ్యలు..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఆ తర్వాత వరుస విజయాలు సొంతం చేసుకోవడంతో ప్రియమణి స్టార్ హీరోయిన్ స్టేటస్ ను అందుకున్నారు.యమదొంగ సినిమాతో ప్రియమణి కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందుకోవడం గమనార్హం.

ప్రస్తుతం తెలుగులో వరుస సినిమా ఆఫర్లతో ప్రియమణి బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

సోషల్ మీడియాలో తనపై వచ్చే ట్రోల్స్ గురించి మాట్లాడుతూ ప్రియమణి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Telugu Fat Shamed, Maidaan, Negative Comments, Netizens Comments, Personal Secrets, Priyamani, Priyamani Insulted, Priyamani Trolled, Tollywood, Virataparvam, Yamadonga Movie-Movie

పెళ్లి తర్వాత తాను బరువు పెరిగానని అందువల్ల కొంతమంది బ్లాకీ అని ఓల్డ్ అని కామెంట్లు చేశారని ప్రియమణి చెప్పుకొచ్చారు.మరి కొందరు లావుగా ఉన్నావని కామెంట్లు చేశారని ఇప్పుడు వాళ్లే సన్నగా అయ్యావని కామెంట్లు చేస్తారని ఆమె తెలిపారు.గతంతో పోలిస్తే దర్శకనిర్మాతల ఆలోచనాతీరు మారిందని ఆమె తెలిపారు.

Telugu Fat Shamed, Maidaan, Negative Comments, Netizens Comments, Personal Secrets, Priyamani, Priyamani Insulted, Priyamani Trolled, Tollywood, Virataparvam, Yamadonga Movie-Movie

ప్రస్తుతం పెళ్లైన హీరోయిన్లు కూడా అవకాశాలు అందిపుచ్చుకుంటున్నారని ఆమె వెల్లడించారు.విరాటపర్వం సినిమాతో పాటు మైదాన్ సినిమాలో కీలక పాత్రలో ప్రియమణి నటిస్తుండటం గమనార్హం.తన శరీర రంగు గురించి కూడా ట్రోలింగ్స్ చేశారని నలుపు కూడా అందమైనదే అని ఎవరినీ నల్లగా ఉన్నారని అనవద్దని ఆమె చెప్పుకొచ్చారు.

తాను ముదురు రంగులో ఉంటానని అలా ఉండటంలో తప్పేంటని ఆమె అన్నారు.మొదట మీ అభిప్రాయాన్ని మార్చుకోవాలని తనపై నెగిటివ్ కామెంట్లు చేసేవాళ్లకు ప్రియమణి సూచనలు చేశారు.

#Maidaan #Virataparvam #Fat Shamed #Priyamani

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు