ఆ రూ.300 ఇప్పటికీ దాచుకున్నా.. ప్రియమణి కామెంట్స్ వైరల్..?

తెలుగులో స్టార్ హీరోయిన్ స్టేటస్ ను సొంతం చేసుకోలేకపోయినా సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా బుల్లితెర ఆఫర్లతో, వెండితెర ఆఫర్లతో ప్రియమణి బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.ఈటీవీలో ప్రసారమవుతున్న ఢీ షోకు జడ్జిగా వ్యవహరిస్తున్న ప్రియమణి తాజాగా ఒక సందర్భంలో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

 Priyamani Reveals Sharukh Khan Gave Her 300 Rs Channai Express Set Wallet-TeluguStop.com

హిందీలో బ్లాక్ బస్టర్ హిట్టైన చెన్నై ఎక్స్ ప్రెస్ మూవీలో ప్రియమణి ఐటమ్ సాంగ్ చేసిన సంగతి తెలిసిందే.

చెన్నై ఎక్స్ ప్రెస్ లోని వన్ టూ త్రీ ఫోర్ సాంగ్ సూపర్ హిట్ కావడంతో పాటు ప్రియమణి డ్యాన్స్ పర్ఫామెన్స్ కు మంచి మార్కులు పడ్డాయి.

 Priyamani Reveals Sharukh Khan Gave Her 300 Rs Channai Express Set Wallet-ఆ రూ.300 ఇప్పటికీ దాచుకున్నా.. ప్రియమణి కామెంట్స్ వైరల్..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఐటెం సాంగ్ షూటింగ్ సమయంలో జరిగిన సంఘటనలను ప్రియమణి తాజాగా గుర్తు చేసుకున్నారు.వన్ టూ త్రీ ఫోర్ సాంగ్ షూటింగ్ టైమ్ లో ఐ ప్యాడ్ లో కౌన్ బనేగా కరోడ్ పతి ఆడుతుండగా షారుఖ్ 300 రూపాయలు ఇచ్చారని ఆ డబ్బులు ఇప్పటికీ దాచుకున్నానని ప్రియమణి తెలిపారు.

బాలీవుడ్ బాద్ షా అని షారుఖ్ ఖాన్ ను పిలవడానికి స్పెషల్ రీజన్ ఏమీ లేదని ప్రియమణి చెప్పుకొచ్చారు.మన దేశంలో గ్రేట్ యాక్టర్స్ లో షారుఖ్ ఒకరని ప్రియమణి వెల్లడించారు.షూటింగ్ లో పాల్గొనే టైమ్ లో కూడా షారుఖ్ సింపుల్ గా ఉంటారని షారుఖ్ విజయాన్ని తలకెక్కించుకునే నటుడు కాదని ఆమె అన్నారు.షారుఖ్ ఎప్పుడూ స్వీట్ గా సింపుల్ గా ఉంటారని ప్రియమణి పేర్కొన్నారు.

షారుఖ్ ఖాన్ యొక్క వ్యక్తిత్వం ఆయనను మరింత ఎక్కువమంది ఇష్టపడేలా చేస్తుందని ప్రియమణి వెల్లడించారు.తనతో పాటు ఉండేవాళ్లను సైతం కంఫర్ట్ గా ఉండేలా షారుఖ్ ఖాన్ చూసుకుంటారని ప్రియమణి అన్నారు.టైమ్ వేస్ట్ కాకుండా షారుఖ్ జాగ్రత్తలు తీసుకునే వారని షూటింగ్ టైమ్ ను షారుఖ్ చక్కగా ప్లాన్ చేసుకునే వారని ప్రియమణి తెలిపారు.

#Sharukh Khan #Rupees #Wallet #Priyamani

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు