సమంతపై ప్రశంసలు కురిపించిన ప్రియమణి

సౌత్ ఇండియా సినిమాలలో ఒకప్పుడు హీరోయిన్స్ పెళ్లి చేసుకుంటే వారికి అవకాశాలు ఉండేవి కావు.ఎంత పెద్ద స్టార్ హీరోయిన్ హీరోయిన్ అయిన పెళ్లి అయితే పూర్తిగా పక్కనే పెట్టేసేవారు.

 Priyamani Praises On Samantha, Tollywood, Telugu Heroines, South Heroines, Celeb-TeluguStop.com

ఇక ఆ భామలు కూడా సినిమాలకి కొంత విరామం ఇచ్చి మళ్ళీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రీఎంట్రీ ఇచ్చేవారు.అయితే అలాంటి వాటికి స్టార్ హీరోయిన్ సమంత బ్రేక్ వేసింది.

పెళ్లి తర్వాత కూడా ఈ అమ్మడు వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ వస్తుంది.మరో వైపు లేడీ ఒరియాంటెడ్ కథలతో కూడా సత్తా చాటుతుంది.

ఈ విషయంలో సమంత చాలా మందికి రోల్ మోడల్ గా ఉంది.ఇదే విషయాన్ని ప్రియమణి కూడా చెబుతూ సమంతని ఆకాశానికి ఎత్తేసింది.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రియమణి సమంత గురించి ప్రస్తావించింది.ఆమె కారణంగా నాకు కూడా మళ్ళీ అవకాశాలు పెరిగాయని చెప్పింది.

వివాహం జరిగిన అనంతరం కూడా సమంతకు చాలా డిమాండ్ ఉందని తెలిపింది.సమంత తన ప్రతిభతో చాలా మందికి ఆదర్శంగా నిలిచిందని చెప్పింది.హీరోయిన్లకు నిశ్చితార్థం జరిగిందని తెలిస్తే ఒకప్పుడు అవకాశాలు తగ్గిపోయేవని ప్రియమణి, అయితే, ప్రస్తుతం సినీ పరిశ్రమ మరోలా ఆలోచిస్తోందని తెలిపింది.ఇందుకు మంచి ఉదాహరణగా సమంత నిలుస్తోందని చెప్పింది.

వివాహం అనంతరం కూడా సమంతకు క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదని ప్రియమణి గుర్తు చేసింది.సమంత తన శరీరాకృతి విషయంలో తీసుకుంటున్న జాగ్రత్తలు చాలా బాగున్నాయని చెప్పింది.

తనకు కూడా సినీ పరిశ్రమలో చెప్పుకోదగ్గ స్థాయిలోనే అవకాశాలు వస్తున్నాయని తెలిపింది.ప్రస్తుతం ప్రియమణి ఓ వెబ్ సిరీస్ తో పాటు నారప్ప సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.

మొత్తానికి సమంతని స్పూర్తిగా తీసుకొని చాలా మంది భామలు హీరోయిన్ గా తమ కెరియర్ ని కొనసాగించేందుకు ఆసక్తి చూపిస్తున్నారని ప్రియమణి మాటలతో తెలుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube