షారుక్ ఖాన్ సినిమాలో ప్రియమణి.. అలాంటి పాటకు డ్యాన్స్?

టాలీవుడ్ నటి కన్నడ బ్యూటీ ప్రియమణి రీ ఎంట్రీ తో వరుస సినిమాలలో ఓ రేంజ్ లో దూసుకుపోతుంది.తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

 Heroine Priyamani Dancing To A Special Song In Sharukh Khan Movie, Priyamani, S-TeluguStop.com

స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హోదాను సంపాదించుకుంది.ఈ మధ్య గ్లామర్ డోస్ ను కూడా పరిచయం చేసింది.

గతంలో తన పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న ప్రియమణి మళ్లీ రీ ఎంట్రీతో మంచి సక్సెస్ లు అందుకుంటుంది.ఇదిలా ఉంటే షారుఖ్ ఖాన్ సినిమాలో మరో అవకాశాన్ని అందుకుంది.

వెండి తెరపైనే కాకుండా బుల్లితెరపై కూడా తనే పరిచయాన్ని మరింత పెంచుకుంటుంది.పైగా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా సంపాదించుకుంది.ఒకప్పుడు బొద్దుగా ఉండే ప్రియమణి ఇప్పుడు పూర్తిగా సన్నబడి తన గ్లామర్ ను పరిచయం చేస్తుంది.తెలుగుతో పాటు మరిన్ని భాషలలో కూడా నటించింది.

పలు సినిమాల్లో స్పెషల్ సాంగ్ కూడా మెప్పించింది.

ఇదిలా ఉంటే బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ నటిస్తున్న సినిమాలో అవకాశాన్ని అందుకుంది.

ప్రస్తుతం షారుఖ్ ఖాన్ అట్లీ కుమార్ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నాడు.

Telugu Bollywood, Dance, Nayanthara, Priyamani, Shahrukh Khan, Sharukhakhan-Movi

ఇందులో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతార హీరోయిన్ గా నటించనుంది.అంతే కాకుండా పలువురు టాలీవుడ్ సెలబ్రేటీలు కూడా ఇందులో నటించనున్నట్లు తెలిసింది.ఇక ఈ సినిమాలోనే ఓ స్పెషల్ పాటలో ప్రియమణి నటించనున్నట్లు టాక్ వినిపిస్తోంది.

ఇంతకుముందే షారుక్ ఖాన్ తో కలిసి చెన్నై ఎక్స్ ప్రెస్ లో స్పెషల్ సాంగ్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.ఇక మరోసారి షారుక్ ఖాన్ తో జతకట్టనుంది ప్రియమణి.

ఇక ఈ విషయం గురించి త్వరలోనే అధికారిక ప్రకటన చేయనున్నారు.ఈ సినిమా తో పాటు విరాటపర్వం సినిమాలో కూడా నటిస్తుంది.

ఇటీవలే మరో స్టార్ హీరో సినిమాలో కూడా అవకాశం అందుకుంది ప్రియమణి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube