థ్రిల్లర్ వెబ్ సిరీస్ తో సందడి చేయబోతున్న కమెడియన్ ప్రియదర్శి

ప్రస్తుతం సిల్వర్ స్క్రీన్ పై సినిమాల జోరు తగ్గడంతో వెబ్ సిరీస్ ల ట్రెండ్ మొదలైంది.ఇప్పటికే డిజిటల్ స్క్రీన్ పై డిఫరెంట్ కంటెంట్ వెబ్ సిరీస్ లు ప్రేక్షకుల ముందుకి వచ్చాయి.

 Priyadarsi Thriller Web Series For Aha, Nandini Rai, Tollywood, Jathi Rathnalu M-TeluguStop.com

రెగ్యులర్ కథలు కాకుండా ప్రేక్షకులకి క్యూరియాసిటీ పెంచే కథలని దర్శక, నిర్మాతలు వెబ్ సిరీస్ ల కోసం సిద్ధం చేస్తున్నారు.ప్రస్తుతం ఎక్కువగా ట్రెండింగ్ లో ఉన్న కామెడీ, క్రైమ్, థ్రిల్లర్ ఎలిమెంట్స్ చుట్టూనే కథలని సిద్ధం చేసుకొని వాటితోనే డిజిటల్ ప్రేక్షకులని మెప్పిస్తున్నారు.

హిందీలో ఇప్పటికే రొమాంటిక్, క్రైమ్, థ్రిల్లర్ డ్రామాలతో వెబ్ సిరీస్ లు వస్తున్నాయి.వాటికి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వస్తుంది.

ఈ నేపధ్యంలో సౌత్ లో కూడా అలాంటి కథలని ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు.

కాజల్ అగర్వాల్ తో వెంకట్ ప్రభు లైవ్ టెలికాస్ట్ అనే వెబ్ సిరీస్ తెరకెక్కించారు.

హర్రర్ థ్రిల్లర్ గా తెరకెక్కించిన ఈ వెబ్ సిరీస్ కి మంచి టాక్ వచ్చింది.ఇప్పుడు అలాంటి మరో వెబ్ సిరీస్ లో కాజల్ అగర్వాల్ నటిస్తుంది.

అలాగే తెలుగులో కూడా క్రైమ్, థ్రిల్లర్ కాన్సెప్ట్ లతో సిరీస్ వస్తున్నాయి.ఇక కమెడియన్ ప్రియదర్శి కూడా డిజిటల్ ఎంట్రీ ఇవ్వనున్నాడు.

అయితే తాను చేయబోయే వెబ్ సిరీస్ లో కమెడియన్ గా కాకుండా సీరియస్ రోల్ లో కనిపించబోతున్నాడు.సీనియర్ దర్శకుడు సురేష్ కృష్ణ నిర్మాణంలో విద్యా సాగర్ అనే కొత్త దర్శకుడు ఈ వెబ్ సిరీస్ ని తెరకెక్కించనున్నారు.

ఇందులో ప్రియదర్శికి జోడీగా బిగ్ బాస్ ఫేం నందిని రాయ్ కనిపించబోతుంది.దీనికి ఐ.

ఎన్.జి అనే టైటిల్ ని ఖరారు చేస్తూ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు.ఆహలో ఈ వెబ్ సిరీస్ రిలీజ్ కాబోతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube