కరోనాపై ప్రియదర్శి సెటైర్.. నా బతుకు నేను బతుకుతా అంటూ?

తెలుగు సిని నటుడు ప్రియదర్శి పులికొండ. 2016లో పెళ్లి చూపులు సినిమా తో వెండితెరకు పరిచయమైన ప్రియదర్శి.

 Priyadarshi Satire On Corona-TeluguStop.com

అదే ఏడాదిలో టెర్రర్ సినిమాలో టెర్రరిస్టుగా నటించాడు.తెలంగాణ భాషలో మాట్లాడుతూ అందర్నీ ఆకట్టుకున్నాడు ప్రియదర్శి.

అంతే కాకుండా కొన్ని సినిమాలలో కీలక పాత్రలో కూడా నటించాడు.ఇక చాలావరకు హాస్య పూరిత పాత్రలతో బాగా మెప్పించాడు.

 Priyadarshi Satire On Corona-కరోనాపై ప్రియదర్శి సెటైర్.. నా బతుకు నేను బతుకుతా అంటూ-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇదిలా ఉంటే ప్రియదర్శిని ప్రస్తుతం పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని కరోనా పై సెటైర్ వేశాడు.

ప్రియదర్శిని సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటాడు.

తనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను ఎప్పటికప్పుడు అభిమానులతో తెగ షేర్ చేసుకుంటాడు.అంతేకాకుండా తాను నటించబోయే సినిమా అప్ డేట్ లను కూడా పంచుకుంటాడు.

ఇదిలా ఉంటే ఈ ఏడాది విడుదలైన నాంది, జాతి రత్నం సినిమాలలో తన పాత్రతో బాగా మెప్పించాడు.


ఇదిలా ఉంటే ప్రస్తుతం కోవిడ్ కారణంగా మాస్క్ లు తప్పని సరిగా ధరించాల్సి ఉంటుంది.

లేదంటే చేతిలారా ప్రాణం మీదకు తెచ్చుకున్నట్లవుతుంది.ఇక దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రియదర్శి.

ఓ మెసేజ్ లాంటిది పంచుకున్నాడు.తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో ఓ ఫోటో ని షేర్ చేసుకోగా ప్రస్తుతం అది వైరల్ గా మారింది.

అందులో ప్రియదర్శి తన రెండు ఫొటోలను ఎడిట్ చేసి.కరోనా సమయంలో ఎటువంటి మాస్క్ పెట్టుకోకుండా ఉన్న ఫోటో పెడుతూ.అందులో ‘నా చావు నేను సస్తా, నీకెందుకు?’ అని రాయగా, మరో ఫోటో లో మాస్క్ ధరించుకొని.‘నా బతుకు నేను బతుకుతా, నా అవసరం’ అంటూ రాసుకొచ్చాడు.దీనిని బట్టి కరోనా సమయంలో వైరస్ నాకు వస్తుందా.అనే ధీమాతో మాస్క్ ధరించకుండా ఉన్నందుకు తీర వైరస్ వచ్చాక.అప్పుడు బతుకుపై భయం అనేది ఉంటున్నట్లు ప్రియదర్శి అభిమానులకు మంచి మెసేజ్ ఇచ్చాడు.అంతేకాకుండా ఈ రెండు ఫోటోలలో గమనించినట్లయితే ‘లైఫ్ ఎప్పుడు వస్తుంది’ అని కామెంట్ కూడా చేశాడు.

#Corona #Satire #Priyadarshi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు