ప్రియా వారియర్‌ సోషల్‌ బిజినెస్‌కు షాక్‌ అవ్వాల్సిందే   Priya Varrier Shocks About Her Social Business     2018-07-11   04:07:59  IST  Raghu V

మలయాళ చిత్రం ‘ఒరు అదార్‌ కాదల్‌’ చిత్రంలో ఒక హీరోయిన్‌గా నటించిన ప్రియా వారియర్‌ ప్రస్తుతం దేశ వ్యాప్తంగా విపరీతమైన క్రేజ్‌ను కలిగి ఉంది. ఆ చిత్రంలో ఒక పాటలో ఈమె చిన్న కన్నుగీటే సీన్‌ మరియు ముద్దుగన్‌ సీన్స్‌తో ఒక్కసారిగా స్టార్‌ అయ్యింది. ఓవర్‌ నైట్‌ స్టార్‌ అయిన ప్రియా వారియర్‌కు సోషల్‌ మీడియాలో భారీ ఎత్తున ఫాలోవర్స్‌ ఉన్నారు. మయాళంలో ప్రస్తుతం అత్యధిక పారీతోషికం తీసుకుంటున్న హీరోయిన్‌గా ఈ అమ్మడు రికార్డు సాధించింది. ఇక మయాళ హీరోయిన్స్‌ పెద్దగా బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరించరు. కాని ప్రియా వారియర్‌ మాత్రం వరుసగా పలు కంపెనీల బ్రాండ్స్‌కు అంబాసిడర్‌గా వ్యవహరిస్తుంది.

ప్రియా వారియర్‌ ఒక్క యాడ్‌లో నటించేందుకు ఏకంగా కోటి రూపాయల పారితోషికం తీసుకుంటుంది. ఒకటి రెండు ప్రెస్‌మీట్‌లు, ఒక ఫొటో షూట్‌ రెండు రోజుల యాడ్‌ చిత్రీకరణలో పాల్గొన్నందుకు ప్రియా వారియర్‌కు ఏకంగా కోటి రూపాయల వరకు సంస్థలు ముట్టజెప్పుతున్నాయి. ఇక ప్రియా వారియర్‌కు సోషల్‌ మీడియాలో భారీ ఎత్తున ఫాలోవర్స్‌ ఉన్నారు. ఇన్‌స్టాగ్రాం, ట్విట్టర్‌, ఫేస్‌బుక్‌ ఇలా అన్ని సోషల్‌ వెబ్‌సైట్లలో ఈమెకు భారీ ఎత్తున అభిమానులు ఉండటంతో వాటి ద్వారా కూడా లక్షల్లో ఈ అమ్మడు సొమ్ము మూట కట్టుకుంటున్నట్లుగా తెలుస్తోంది.

యాడ్స్‌లో నటించడమే కాకుండా, ఆ యాడ్స్‌ను లేదా ఇతర కంపెనీల యాడ్స్‌ను తన సోషల్‌ మీడియా అకౌంట్స్‌లో పోస్ట్‌ చేయడంతో లక్షల్లో పారితోషికంగా తీసుకుంటుంది. ప్రియా వారియర్‌ ఇన్‌స్టాగ్రాంలో యాడ్‌ను పోస్ట్‌ చేయాలి అంటే ఏకంగా 8 లక్షలు తీసుకుంటుంది. ఆ యాడ్‌ కేవలం వారం రోజులు మాత్రమే ఉంచుతారట. ఆ యాడ్‌ గురించి తన అకౌంట్‌లో పోస్ట్‌ చేస్తే భారీ ఎత్తున రీచ్‌ ఉంటుందని, అందుకే ఇంత భారీ స్థాయిలో తీసుకుంటున్నట్లుగా చెబుతుంది. మొత్తానికి ప్రియా వారియర్‌ ప్రస్తుతం నాలుగు చేతులతో సంపాదిస్తుంది అంటూ మలయాళ మీడియా సంస్థలు చెబుతున్నాయి. ప్రియా వారియర్‌కు బాలీవుడ్‌ నుండి కూడా పిలుపు వచ్చింది. అయితే ప్రస్తుతానికి ఈమె మలయాళ సినిమాల్లో మాత్రమే నటిస్తూ ఉంది. తెలుగులో కూడా ఒక ప్రముఖ హీరోకు జోడీగా నటించాల్సిందిగా ఒక నిర్మాత ఈమెను సంప్రదించడం జరిగింది. అయితే ఆ నిర్మాతకు సన్నితంగా ఈమె నో చెప్పినట్లుగా తెలుస్తోంది.

ప్రకటన : తెలుగుస్టాప్ వెబ్ సైట్ లో పని చేయుట కొరకు అనుభవజ్ఞులైన తెలుగు కంటెంట్ రచయితలు,రాజకీయ విశ్లేషకులు,సోషల్ మీడియా ఫొటోస్/వీడియోస్ అడ్మిన్స్,వీడియో ఎడిటర్,వీడియో మేకర్స్,లైవ్ రిపోర్టర్ లు కావలెను..మీ వివరాలను telugustop@gmail.com కు మెయిల్ చేయగలరు.