ఒక్క పోస్ట్ కోసం ప్రియా వారియర్ ఎంత తీసుకుంటారో మీకు తెలుసా..?

కన్నుగీటు వీడియో ద్వారా ఓవర్ నైట్ లో ప్రియా ప్రకాష్ వారియర్ స్టార్ హీరోయిన్ స్టేటస్ ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.అయితే ఆ స్టేటస్ ఈమె కెరీర్ కు మాత్రం పెద్దగా ఉపయోగపడలేదు.

 Actress Priya Prakash Warrier  Remuneration For Social Media Posts, Five Lakh Ru-TeluguStop.com

ప్రియా ప్రకాష్ వారియర్ నటించిన తొలి సినిమా ఒరు ఆడార్ లవ్ కు బిజినెస్ బాగానే జరిగినా ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్ గా మాత్రం నిలవలేదు.తెలుగులో ఈ ఏడాది ప్రియా వారియర్ నటించిన ఇష్క్, చెక్ సినిమాలు విడుదలయ్యాయి.

అయితే ఈ రెండు సినిమాలు ఫ్లాప్ గా నిలవడంతో ప్రియా ప్రకాష్ కు కొత్త సినిమా ఆఫర్లు ఎక్కువగా రావడం లేదు.తెలుగులో స్టార్ హీరోలు సైతం ప్రియా ప్రకాష్ కు తమ సినిమాల్లో ఛాన్స్ ఇవ్వడం లేదు.

ప్రియా ప్రకాష్ హిందీ, కన్నడ భాషల్లో నటించిన సినిమాలు రిలీజ్ కావాల్సి ఉంది.ఆ సినిమాలు సక్సెస్ సాధిస్తే మాత్రమే ఆమె కెరీర్ కు ప్రయోజనం చేకూరుతుంది.

మరోవైపు ప్రియా ప్రకాష్ ఫ్లాప్ హీరోయిన్ అనే కామెంట్లు సైతం వినిపిస్తున్నాయి.

అయితే ఒరు ఆడార్ లవ్ ద్వారా ఈ బ్యూటీకి సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ భారీగా పెరిగింది.

Telugu Rupees, Flop, Ishq, Oru Adaar Love, Priya Warrier, Followers-Movie

ప్రస్తుతం ఈ బ్యూటీ ఒక్కో పోస్ట్ కోసం 5 లక్షల రూపాయలు తీసుకుంటున్నారని సమాచారం.ఏడు మిలియన్ల ఫాలోవర్లు ఉండటంతో ప్రముఖ కంపెనీలు సైతం భారీ మొత్తాన్ని ఇవ్వడానికి ఆసక్తి చూపుతున్నాయి.ఈ విధంగా ప్రియా వారియర్ ఎక్కువ మొత్తంలో సంపాదించుకుంటూ తన క్రేజ్ ను క్యాష్ చేసుకుంటున్నారు.

Telugu Rupees, Flop, Ishq, Oru Adaar Love, Priya Warrier, Followers-Movie

అయితే పోస్టులకు భారీ మొత్తంలో తీసుకునే ఈ బ్యూటీ పారితోషికం విషయంలో మాత్రం ఎక్కువ మొత్తం డిమాండ్ చేయడం లేదని తెలుస్తోంది.హీరోను, పాత్రను బట్టి ప్రియా ప్రకాష్ వారియర్ రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని సమాచారం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube