వింక్‌ బ్యూటీ రెండవ ప్రయత్నం అయినా ఫలితాన్ని ఇస్తుందా

మలయాళి ముద్దుగుమ్మ వింక్ బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్‌ ఆశించిన స్థాయిలో సక్సెస్‌ లను దక్కించుకోవడం లేదు.ఆమెకు సోషల్‌ మీడియాలో గుర్తింపు తెచ్చి పెట్టిన మొదటి సినిమా థియేటర్లలో ఆడలేదు.

 Priya Prakash Wariar New Movie With Teja Sajja Ishq, Naandhi Movie, Nithin, Priy-TeluguStop.com

ఆ తర్వాత ఆమె హిందీ, తమిళం, మలయాళం మరియు ఇతర భాషల నుండి ఆఫర్లు అయితే అందుకుంటుంది కాని సక్సెస్‌ అవుతున్న దాఖలాలు మాత్రం కనిపించడం లేదు.పెద్ద ఎత్తున ఈ అమ్మడు చేస్తున్న సినిమా లు బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడుతున్న నేపథ్యంలో ప్రస్తుతం తెలుగులో చేస్తున్న ఇస్క్‌ ఇట్స్ నాట్‌ ఎ లవ్‌ స్టోరీ పై అంచనాలు పెంచేసుకుంది.

ఈ సినిమా లో తేజ సజ్జ తో కలిసి ప్రియా వారియర్‌ నటిస్తోంది.ఇటీవలే ఫస్ట్‌ లుక్ వచ్చిన ఈ సినిమా విడుదలకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా మేకర్స్ పేర్కొన్నారు.

ప్రస్తుతం సినిమాకు సంబంధించిన తుది దశ కార్యక్రమాలు జరుపుకుంటున్నట్లుగా తెలుస్తోంది.

తెలుగులో ప్రియా ప్రకాష్‌ వారియర్‌ మొదటి సినిమా నితిన్ తో కలిసి చేసిన విషయం తెల్సిందే.

చెక్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రియా ప్రకాష్‌ వారియర్‌ పెద్దగా ఆకట్టుకోలేక పోయింది.చెక్ సినిమా షూటింగ్ సమయంలో ప్రియా ప్రకాష్‌ వారియర్ పాత్ర పై అంచనాలు చాలా పెంచుకున్నారు.

కాని సినిమా లో ఆమె గెస్ట్ పాత్రకు ఎక్కువ హీరోయిన్ పాత్రకు తక్కువ అన్నట్లుగా ఉంది.మరి ఆయన సెకండ్ సినిమ ఇస్క్‌ అయినా ఆమెకు తెలుగు లో మంచి గుర్తింపును తెచ్చి పెడుతుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

వింక్ బ్యూటీగా దేశ వ్యాప్తంగా సూపర్‌ ఇమేజ్ ను దక్కించుకున్న ప్రియా ప్రకాష్‌ వారియర్‌ ఇప్పుడు రెండవ సినిమా ఇస్క్‌ తో తెలుగులో సక్సెస్ దక్కించుకుని మరిన్ని సినిమా లను చేస్తుందా అనేది చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube