మాస్ స్టెప్పులేసిన వింక్ బ్యూటీ.. వాళ్లు ఛాన్స్ ఇస్తారా..?

ఒరు ఆడార్ లవ్ సినిమాలోని చిన్న సీన్ ద్వారా ఓవర్ నైట్ లో సౌత్ ఇండియా అంతటా గుర్తింపు తెచ్చుకుంది వింక్ బ్యూటీ ప్రియా వారియర్.ఆ సినిమా హిట్ కాకపోయినా ప్రియా వారియర్ సోషల్ మీడియా ఫాలోవర్స్ సంఖ్య మాత్రం ఊహించని స్థాయిలో పెరిగింది.

 Priya Prakash Varrier Mass Steps For Laadi Laadi Song, Priya Prakash Varrier , L-TeluguStop.com

చిన్న సీన్ ద్వారా వచ్చిన గుర్తింపు వల్ల హిందీ, తెలుగుతో పాటు ఇతర భాషల్లో సైతం ప్రియా వారియర్ కు సినిమా ఆఫర్లు బాగానే వస్తున్నాయి.
అయితే క్లాస్ గా కనిపించే ప్రియా వారియర్ తొలిసారి ఒక ప్రైవేట్ సాంగ్ కు కాలు కదిపారు.

ప్రియా వారియర్ ప్రైవేట్ సాంగ్ చేయడంలో ఆశ్చర్యం లేకపోయినా వింక్ బ్యూటీ తొలిసారి ఊరమాస్ స్టెప్పులు వేయడం గమనార్హం.లడి లడి అనే మాస్ సాంగ్ లో ప్రియా వారియర్ రోహిత్ నందన్ తో కలిసి స్టెప్పులేశారు.

మాస్ అభిమానులను ఆకట్టుకునేలా ప్రియా వారియర్ స్టెప్పులు ఉండటంతో ప్రియకు స్టార్ హీరోలు, స్టార్ డైరెక్టర్లు తమ సినిమాల్లో అవకాశాలు ఇస్తారేమో చూడాల్సి ఉంది.

లడి లడి పాటకు శ్రీ చరణ్ పాకాల మ్యూజిక్ అందించగా “చీకట్లో రంగులే కావాలా బావా.మిడ్ నైట్ లో రెయిన్ బో ని చూడాలి బావా” అంటూ విస్సా ప్రగఢ లిరిక్స్ అద్భుతంగా రాశారు.ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ ఈ పాటను పాడగా స్టార్ కొరియోగ్రాఫర్ రఘు మాస్టర్ ఈ పాటకు కొరియోగ్రఫీ చేశారు.

ఈ పాటకు యూట్యూబ్ లో 12 లక్షల వ్యూస్, 9,200 లైక్స్ వచ్చాయి.యూట్యూబ్ లో ఈ పాట ట్రెండింగ్ లో ఉంది.
ఈ పాటకు డ్యాన్స్ చేయడంతో పాటు ప్రియా వారియర్ రాహుల్ సిప్లిగంజ్ తో కలిసి పాట పాడారు.రోహిత్ నందన్ కూడా డ్యాన్స్ అద్భుతంగా చేశారు.

మరోవైపు ప్రియా వారియర్ నితిన్ హీరోగా తెరకెక్కుతున్న చెక్ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube