రొమాంటిక్ థ్రిల్లరే.. కానీ అలాంటి సీన్స్ ఏం ఉండవు: ప్రియా ప్రకాష్

ఒక్క కన్ను గీటుతో అందరినీ తన మాయలో పడేసిన మలయాళీ బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్.ఒరు అడార్ లవ్ అనే సినిమాతో ఇండస్ట్రీకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ ఈ సినిమాతో అంత సక్సెస్ అందుకోలేదు.

 Priya Prakash Varrier Interview About Ishq Movie-TeluguStop.com

కానీ ఇందులో ఓ పాటలో కన్ను కొట్టి మంచి క్రేజ్ సంపాదించుకుంది.ఆ ఒక్క ఎక్స్ ప్రెషన్స్ తో ప్రపంచాన్ని తన వైపుకు లాక్కొని ఓవర్ నైట్ స్టార్ గా మారింది.

ఫస్ట్ లుక్ తోనే ప్రేక్షకులను ఇంప్రెస్ చేసింది ఈ ముద్దుగుమ్మ.

 Priya Prakash Varrier Interview About Ishq Movie-రొమాంటిక్ థ్రిల్లరే.. కానీ అలాంటి సీన్స్ ఏం ఉండవు: ప్రియా ప్రకాష్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తన మొదటి సినిమా తర్వాత అలనాటి తార శ్రీదేవికి సంబంధించిన ఓ సినిమాలో నటించగా ఈ సినిమా ట్రైలర్ తోనే ముగిసింది.

టాలీవుడ్ యంగ్ స్టార్ హీరో నితిన్ నటించినచెక్సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం కాగా ఈ సినిమా అంత సక్సెస్ ని ఇవ్వలేదు.ఇక మరో యంగ్ హీరో తేజ సజ్జ తో ఇష్క్ సినిమాలో నటించగా ఈ సినిమా విడుదల సమయంలో కోవిడ్ సెకండ్ వేవ్ తో వాయిదా పడింది.

ఇక తాజాగా ఈ సినిమా ఈ నెల 30న విడుదలకు సిద్ధంగా ఉంది.ఈ నేపథ్యంలో ప్రియా ప్రకాష్ వారియర్ ఈ సినిమా గురించి కొన్ని విషయాలు పంచుకుంది.

ఈ సినిమాలో తనకు అనుకోకుండా అవకాశం వచ్చిందటఈ సినిమా కథ విన్న విన్న వెంటనే ఓకే చెప్పేసిందంట.ఎందుకంటే ఈ సినిమాను మలయాళంలో చూడగా తనకు బాగా నచ్చడంతో వెంటనే ఓకే చెప్పానని తెలిపింది.ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకు మంచి ఆదరణ ఉందని, మలయాళం తో పోలిస్తే ఇక్కడి ప్రేక్షకుల అభిరుచులు భిన్నంగా ఉన్నాయని తెలిపింది.అంతేకాకుండా తనకు హైదరాబాద్ రెండో ఇల్లు లాంటిదని తెలిపింది.

ఇక ఇష్క్ సినిమా రొమాంటిక్ థ్రిల్లర్ అని తెలిపింది.హీరో హీరోయిన్లు ప్రేమలో పడటం తర్వాత సమస్యలు రావడం.వాటిని పరిష్కరించడం డ్యూయెట్ పాటలు వంటివి ఈ సినిమాలో ఉండవని తెలిపింది.ఈ సినిమా ప్రతి ఒక్కరికి సంబంధించినదని, ముఖ్యంగా యూత్ కు భిన్నమైన సినిమా అని తెలిపింది.

మలయాళం సినిమాకు ఈ సినిమాకు ఎలాంటి మార్పు లేదని కొన్ని మేకింగ్, టెక్నికల్ మార్పులు చేశారని తెలిసింది.

#Teja Sajja #Malayalee #Romantic #Thrille #ActressPriya

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు