రాత్రికి రాత్రే ఊహించని మార్పు.. ప్రియా వారియర్ ఆసక్తికర వ్యాఖ్యలు..?

ఒరు ఆదార్ లవ్ సినిమా కన్ను గీటే సన్నివేశంతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది ప్రియా ప్రకాష్ వారియర్.ఆ సినిమా తరువాత ప్రియకు ఇతర భాషల్లో కూడా ఆఫర్లు వచ్చాయి.

 Priya Prakash Varrier  Interesting Comments About Nithin Check Movie, Check Movi-TeluguStop.com

అయితే భారీ అంచనాలతో విడుదలైన ఒరు ఆదార్ లవ్ ఫ్లాప్ కావడం ఆమె కెరీర్ కు మైనస్ గా మారింది.ప్రస్తుతం నితిన్ హీరోగా తెరకెక్కుతున్న చెక్ సినిమాలో ప్రియా వారియర్ హీరోయిన్ గా నటిస్తున్నారు.

మరో రెండు రోజుల్లో ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో చెక్ మూవీ ప్రమోషన్స్ లో ప్రియా వారియర్ పాల్గొంటూ చెక్ మూవీ, ఇతర విషయాలకు సంబంధించిన కీలక విషయాలను వెల్లడించారు.ఒరు ఆదార్ లవ్ తెలుగులో లవర్స్ డే పేరుతో విడుదల కాగా ఆ వీడియో వల్ల తన లైఫ్ లో ఊహించని మార్పులు చోటు చేసుకున్నాయని.

ఆ వీడియో తరువాత ఫ్రెండ్స్ తో సరదాగా బయటకు వెళ్లాలన్నా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి నెలకొందని అన్నారు.

Telugu Nithin, Pre, Priyaprakash-Movie

చాలామంది తనను వింక్ బ్యూటీ అని పిలుస్తున్నారని.అలా తనను పిలవడం లక్ అని, ఇకపై నటన ద్వారా ఈ విషయాన్ని మార్చుకుంటానని ఆమె అన్నారు.ప్రియా వారియర్ కు అందం, అభినయం పుష్కలంగా స్టార్ హీరోలు ఆమెను పట్టించుకోవడం లేదు.

టాలీవుడ్, కోలీవుడ్ స్టార్ హీరోల సినిమాల్లో ఆఫర్లు వస్తే మాత్రమే ప్రియకు స్టార్ హీరోయిన్ స్టేటస్ దక్కే అవకాశం ఉంది.

చెక్ సినిమా ఫలితమే ప్రియా వారియర్ భవిష్యత్తును డిసైడ్ చేయనుంది.

ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ లాయర్ పాత్రలో నటిస్తున్నారు.సినిమాల్లో నటించడంతో పాటు సింగర్ గా పాటలు పాడటం ద్వారా కూడా ప్రియ గుర్తింపును సంపాదించుకున్న సంగతి తెలిసిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube