వేడుకున్నా కనికరించలేదు.. చలిలో భోజనం చేసా.. ప్రియా వారియర్ పోస్ట్ వైరల్!

తెలుగులో ఎక్కువ సంఖ్యలో సినిమాలు చేసినా సక్సెస్ లేని నటీమణులలో ప్రియా ప్రకాష్ వారియర్ ఒకరు.అయితే సోషల్ మీడియాలో ఈ హీరోయిన్ కు కోట్ల సంఖ్యలో అభిమానులు ఉన్నారు.

 Priya Prakash Varrier Calld Out Hotel Making Her Sit Outside Premises Eat Her Details, Priya Prakash Varriar, Hotel, Food, Fern Goregav Hotel, Hotel Staff, Priya Prakash Varriar Post, Shooting, Outdoor Food-TeluguStop.com

ఈ హీరోయిన్ కు తెలుగుతో పాటు ఇతర భాషల్లో సినిమా ఆఫర్లు కూడా వస్తున్నాయి.ఒరు ఆడార్ లవ్ సినిమాతో ఓవర్ నైట్ లో పాపులారిటీని సంపాదించుకున్న ప్రియా ప్రకాష్ వారియర్ తాజాగా తనకు ఎదురైన చేదు అనుభవాన్ని పంచుకున్నారు.

తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా హోటల్ నిబంధనల వల్ల తాను ఏ విధంగా ఇబ్బంది పడ్డాననే విషయాన్ని ఆమె చెప్పుకొచ్చారు.షూటింగ్ కొరకు తాను ఫెర్న్ గొరెగావ్ అనే హోటల్ కు వెళ్లానని ఆ హోటల్ నిబంధనల ప్రకారం బయటి ఆహారాన్ని హోటల్ లోకి అనుమతించరని ప్రియా వారియర్ అన్నారు.

 Priya Prakash Varrier Calld Out Hotel Making Her Sit Outside Premises Eat Her Details, Priya Prakash Varriar, Hotel, Food, Fern Goregav Hotel, Hotel Staff, Priya Prakash Varriar Post, Shooting, Outdoor Food-వేడుకున్నా కనికరించలేదు.. చలిలో భోజనం చేసా.. ప్రియా వారియర్ పోస్ట్ వైరల్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అందుకు కారణం ఏమిటంటే హోటల్ లో ఉన్నవాళ్లు బయటినుంచి ఫుడ్ ఆర్డర్ చేయలేరు కాబట్టి హోటల్ లో ఆర్డర్ చేసిన ఫుడ్ కు వాళ్లకే డబ్బులు వస్తాయని ప్రియా వారియర్ చెప్పుకొచ్చారు.

అయితే ఆ హోటల్ నిబంధనల గురించి తనకు మొదట తెలియదని ఆమె అన్నారు.

Telugu Behavior, Hotel, Hotel Staff, Outdoor, Priyaprakash-Movie

తాను షూటింగ్ పూర్తైన తర్వాత ఆహారాన్ని కొనుగోలు చేసి హోటల్ కు వచ్చానని తాను తెచ్చుకున్న ఆహారాన్ని అనుమతించాలని హోటల్ సిబ్బందిని కోరినా వాళ్లు అనుమతించలేదని ఆమె కామెంట్లు చేశారు.ఆహారం కోసం మనీ ఖర్చు చేశానని ఆ ఫుడ్ బయట పాడేయలేనని చెబుతూ వేడుకున్నా వాళ్లు కనికరించలేదని ప్రియా వారియర్ చెప్పుకొచ్చారు.

Telugu Behavior, Hotel, Hotel Staff, Outdoor, Priyaprakash-Movie

తాను వాళ్లను ఒప్పించడానికి ఎంత ప్రయత్నించినా వాళ్లు నా మాటను వినలేదని ప్రియా వారియర్ అన్నారు.హోటల్ సిబ్బంది తనతో అమర్యాదగా ప్రవర్తించారని ఆమె కామెంట్లు చేశారు.అయితే ఆ హోటల్ ను ప్రొడక్షన్ కంపెనీ వాళ్లు బుకింగ్ చేశారని ఆమె చెప్పుకొచ్చారు.చివరకు తాను బయటే చలిలో భోజనం చేశానని ఆమె కామెంట్లు చేశారు.

ప్రియా వారియర్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube