కథ ఒప్పుకోకుండానే ఒకే చెప్పేశా అంటున్న ప్రియా ప్రకాష్

వింక్ బ్యూటీగా రాత్రికి రాత్రే సోషల్ మీడియాలో విశేషమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న నటి ప్రియా ప్రకాష్ వారియర్.ఈ మల్లు బ్యూటీ తనకొచ్చిన ఫేంతో మొదటి సినిమా రిలీజ్ కాకుండానే యాడ్స్ లో వరుస అవకాశాలు సొంతం చేసుకుంది.సినిమా రిలీజ్ తర్వాత ప్రియా ఫేం కాస్తా తగ్గింది.తరువాత ఈ అమ్మడు సినిమా ప్రయత్నాలు మొదలు పెట్టింది.ఆరంభంలో అంతగా అవకాశాలు రాకున్న ఇప్పుడిప్పుడే ఆమె టాలీవుడ్ లో వరుస అవకాశాలతో బిజీ అవుతుంది.నితిన్ హీరోగా చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో తెరకెక్కిన చెక్ సినిమాలో ఆమె హీరోయిన్ గా నటించింది.

 Priya Prakash Open Up On Check Movie, Tollywood, Telugu Cinema, Nithiin, Chandra-TeluguStop.com

ఇందులో ఆమె హీరో ప్రేయసిగా కనిపిస్తుంది.సినిమాలో ఆమె పాత్ర నిడివి తక్కువే అయినా చెక్ మూవీ మీద ప్రియా ప్రకాష్ చాలా ఆశలు పెట్టుకుంది.

ఈ సినిమా సక్సెస్ అయితే కమర్షియల్ హీరోయిన్ గా మరిన్ని అవకాశాలు వస్తాయనే నమ్మకంతో అమ్మడు ఉంది.

తాజాగా ఈ సినిమా ప్రమోషన్ లో ప్రియా ప్రకాష్ చెక్ మూవీ అవకాశం గురించి ఆసక్తికర విషయాలు చెప్పింది.

ఈ సినిమాలో తన పాత్ర కోసం దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి ఫోన్ చేసినపుడు కథ ఏంటి అనే విషయం కూడా అడగకుండానే చేస్తానని చెప్పాను.ఆయన చేసిన మనమంతా సినిమాని మలయాళీలో తాను చూసా.

ఆయన టేకింగ్, కథ చెప్పే విధానం నాకు భాగా నచ్చింది.అందుకే వెంటనే ఆలోచించకుండానే ఈ సినిమాలో నటించడానికి ఒకే చెప్పేశా.

అయితే ఇప్పుడు ఆయన తన నటన బాగుంది అని కామెంట్స్ నాకు రెట్టింపు ఉత్సాహాన్ని ఇచ్చాయని పేర్కొంది.ప్రస్తుతం ఈ అమ్మడు తేజ సజ్జాకి జోడీగా ఇష్క్ అనే రొమాంటిక్ లవ్ స్టొరీలో నటిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube