హాట్ లుక్స్ తో డిస్టర్బ్ చేస్తున్న వింక్ గర్ల్స్

ఒకే ఒక్క టీజర్ తో వింక్ గర్ల్స్ గా సినిమా అభిమానుల మతి పోగోత్తిన మలయాళీ ముద్దుగుమ్మ ప్రియా ప్రకాష్ వారియార్.ఒరు ఆధార్ లవ్ అనే సినిమా లో కన్నుకోట్టిన సీన్ తో ఈ భామ ఒక్కసారిగా పాపులర్ అయిపోయి సోషల్ మీడియా సెలబ్రిటీగా మారిపోయింది.

 Priya Prakash Open Offer To Director With Glamour Photo-TeluguStop.com

దీంతో ఈమె డేట్స్ కోసం దర్శక, నిర్మాతలతో పాటు, యండార్స్మెంట్ కంపెనీలు పరుగులు పెట్టాయి.వచ్చిన అవకాశాలని ఉపయోగించుకొని యాడ్స్ ఎక్కువగా చేసి రెండు చేతులా సంపాదించిన ప్రియా ప్రకాష్ కి తన మొదటి సినిమానే ఊహించని విధంగా షాక్ ఇచ్చింది.

ఆమె క్రేజ్ కారణంగా తెలుగు, తమిళం, మలయాళీ భాషలలో రిలీజ్ అయిన అయిన ఒరు ఆధార్ లవ్ అన్ని చోట్ల డిజాస్టర్ అయ్యింది.తరువాత ప్రియా ప్రకాష్ ఇమేజ్ కూడా తగ్గుతూ వచ్చింది.

అదే సమయంలో అవకాశాలు కూడా అనుకున్న స్థాయిలో రాలేదు.ప్రస్తుతం ఈ అమ్మడు చేతులో ఒక హిందీ మూవీ రిలీజ్ కి రెడీగా ఉంది.

మరో తెలుగు నితిన్ కి జోడీగా చంద్రశేఖర్ ఏలేటి సినిమాలో ఛాన్స్ వచ్చింది.ఇక సొంత భాషలో కూడా చిన్న సినిమాలలోనే అవకాశాలు వస్తున్నాయి.

అయితే యాడ్స్, ఫోటోషూట్ లకి మాత్రం కొదవలేదు.తాజాగా తన మొదటి సినిమా హీరో రోషన్ తో ఈ భామ ఇచ్చిన రొమాంటిక్ హాట్ ఫోటోషూట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

తనలోని గ్లామర్ ని వాడుకోమని దర్శకులకి హిట్ ఇచ్చే విధంగా ఉంది.మరో వైపు గ్లామర్ చూపిస్తూ హాట్ ఫోటోలతో రెచ్చిపోతుంది.

మరి ఈ భామని అర్ధం చేసుకొని దర్శకులు ఎంత వరకు అవకాశాలు ఇస్తారు అనేది చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube