ఆల్బమ్ సాంగ్ లో డాన్స్ తో ఇరగదీసిన వింక్ బ్యూటీ  

మొదటి సినిమాతోనే సోషల్ మీడియాలో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించి పాపులర్ వింక్ బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.ఈ అమ్మడు కన్నుకొట్టి కుర్రాళ్లని ఫ్లాట్ చేసి ఫేమస్ అయిపొయింది.

TeluguStop.com - Priya Prakash First Telugu Album Song

ఆ దెబ్బతో ఒక్కసారిగా యాడ్స్ లో నటించే అవకాశం సొంతం చేసుకుంది.సినిమా నిర్మాతలు కూడా ఈ బ్యూటీ కోసం క్యూకట్టిన మొదటి సినిమాకి అగ్రిమెంట్ ఉండటంతో అది రిలీజ్ అయ్యేంత వరకు రెండో సినిమా చేసే అవకాశం రాలేదు.

ఇక రెండో సినిమాగా బాలీవుడ్ లోకి వెళ్లి శ్రీదేవి బంగ్లా అనే సినిమా చేసింది.ఆ సినిమాపై బోనీ కపూర్ కేసు వేయడంతో రిలీజ్ కాకుండా ఆగిపోయింది.

TeluguStop.com - ఆల్బమ్ సాంగ్ లో డాన్స్ తో ఇరగదీసిన వింక్ బ్యూటీ-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

అదే సమయంలో అనూహ్యంగా టాలీవుడ్ నుంచి పిలుపు వచ్చింది.చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో నితిన్ కి జోడీగా చెక్ సినిమాలో నటించే అవకాశం వచ్చింది.

ఈ సినిమా ద్వారా టాలీవుడ్ లోకి అడుగుపెడుతున్న ఈ అమ్మడు తెలుగు సక్సెస్ అయ్యి స్టార్ హీరోయిన్ అవ్వాలనే ప్రయత్నంలో ఉంది.

ఇక చెక్ తర్వాత యంగ్ హీరో తేజా సజ్జాతో ఇష్క్ అనే రొమాంటిక్ లవ్ స్టోరీలో ఛాన్స్ కొట్టేసింది.

ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభమవుతుంది.ఇదిలా ఉంటే ఈ అమ్మడు ఇప్పుడు తెలుగులో ఒక ఆల్బమ్ సాంగ్ చేసింది.

ఐటెం సాంగ్ తరహాలో ఉన్న ఈ సాంగ్ ని సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చారు.శ్రీచరణ్ పాకాల సంగీతం అందించిన ఈ పాతని రాహుల్ సిప్లిగంజ్ తో ప్రియా ప్రకాష్ వారియర్ పాడటం విశేషం.

మరో వైపు ఆమె ఈ పాటకోసం గొంతు వినిపించడంతో మాస్ డాన్స్ లతో ఇరగదీసింది.ఇక ఈ సాంగ్ తో తనలోనే డాన్స్ డాన్స్ టాలెంట్ ని కూడా వింక్ బ్యూటీ ప్రియా ప్రకాష్ తన అభిమానులకి పరిచయం చేసిందని చెప్పాలి.

మాస్ బీట్స్ తో సాగిన ఈ సాంగ్ యుట్యూబ్ లో బాగానే అలరిస్తుంది.ఈ సాంగ్ లో ప్రియా ప్రకాష్ వారియర్ తో పాటు రోహిత్ నందన్ తన మాస్ స్టెప్పులాతో ఇరగదీసాడు.

#PriyaPrakash

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Priya Prakash First Telugu Album Song Related Telugu News,Photos/Pics,Images..