ప్రియా ఆంటీకి కోపం తెప్పించారేంటి సామి అంటూ నెటిజన్లు ఫైర్?

బిగ్ బాస్ సీజన్ ఫైవ్ కంటెస్టెంట్ గా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఆర్టిస్ట్ ప్రియా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈమె హౌస్ లో అందరితోనూ ఎంతో మంచిగా చనువుగా ఉంటూ అందరితో కలిసి మాట్లాడుతూనే సెటైర్లు వేస్తూ ఎవరి మనసును నొప్పించకుండా హౌస్ సభ్యులతో మెలుగుతున్నారు.

 Priya Got Angry In Bigg Boss House-TeluguStop.com

అయితే కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా హౌస్ సభ్యులందరినీ బిగ్ బాస్ 2 జట్లుగా విడదీసి వారి మధ్య కెప్టెన్సీ టాస్క్ నిర్వహించారు.ఈ టాస్క్ లో భాగంగా రెండు జట్లు తీవ్రస్థాయిలో పోటీ పడిన సంగతి మనకు తెలిసిందే.

ఈ క్రమంలోనే రెండు టీమ్స్ మధ్య మాటా మాటా పెరిగి తీవ్ర గొడవలకు దారి తీశాయి.ఇందులో భాగంగానే అందరితో ఎంతో మంచిగా ఉండే ప్రియ ఏకంగా సన్నీ పై కోప్పడుతూ నువ్వు మగాడివైతే వచ్చి ఆడు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

 Priya Got Angry In Bigg Boss House-ప్రియా ఆంటీకి కోపం తెప్పించారేంటి సామి అంటూ నెటిజన్లు ఫైర్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఎప్పుడూ ఎవరి పై కోపడని ప్రియ ఆంటీకి కోపం తెప్పించారంటే అందుకు ఏదో బలమైన కారణం ఉంటుందని ఆమె అభిమానులు భావిస్తున్నారు.

ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా ఆమె అభిమానులు స్పందిస్తూ టాస్క్ అన్న తర్వాత చిన్నచిన్న గొడవలు జరగడం సర్వసాధారణం అయితే అసలు విషయం ఏమిటో తెలియకుండా ఎవరిని తప్పు పట్టకూడదు అంటూ కామెంట్లు పెడుతున్నారు.ఇక సన్నీ పై ప్రియా చేసిన వ్యాఖ్యలపై సన్నీ అభిమానులు స్పందిస్తూ ఆమె మాటలను తీవ్రంగా ఖండించారు.మొత్తానికి ప్రియా ఈ విధంగా కోపం తెచ్చుకోవడానికి గల కారణం ఏమిటనే విషయాలు పూర్తి ఎపిసోడ్ ప్రసారం అయ్యే వరకు వేచి ఉండాలి.

#Bigg Boss #Bigg Boss #Priya #Priya #Sunny

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు