వాళ్ళని కలిస్తే ప్రేమలో ఉన్నట్లా అంటూ సీరియస్ అవుతున్న ప్రియా ఆనంద్

ఒక హీరోయిన్ ఎవరైనా హీరోతో కాస్త క్లోజ్ గా మూవ్ అయితే వారి మధ్య ఏదో రిలేషన్ ఉందని, డేటింగ్ లో ఉన్నారని కథలు అల్లేస్తూ ఉంటారు.అయితే బాలీవుడ్ లో హీరో, హీరోయిన్స్ మధ్య డేటింగ్ రిలేషన్ ఉన్నట్లు సౌత్ లో ఉండదు.

 Priya Anand Respond On Love Rumors, Adharva Murali, Karthik, Kollywood, Tollywoo-TeluguStop.com

సౌత్ లో అందరూ ఫ్రెండ్లీగా మూవ్ అవుతూ ఉంటారు.పార్టీలకి వెళ్తూ ఉంటారు.

అయితే వారి మధ్య అంతకు మించి రిలేషన్ ఉండదు.కాని సోషల్ మీడియా వచ్చిన తర్వాత హీరో, హీరోయిన్స్ మీద వచ్చే గాసిప్స్ కి కొదవ ఉండదు.

ఎవరికి తోచినట్లు వారు కథనాలు రాసేస్తూ ఉంటారు.అలాగే ఇప్పుడు లీడర్, రామ రామ కృష్ణ కృష్ణ సినిమాలలో హీరోయిన్ గా చేసి మలయాళీ చిత్ర పరిశ్రమలో వరుస సినిమాలతో రాణిస్తున్న ప్రియా ఆనంద్ మీద గత కొంత కాలంగా రూమర్స్ వినిపిస్తున్నాయి.

ఆమె కొంత మంది హీరోలతో ప్రేమాయణం సాగిస్తుందని ప్రచారం జరుగుతుంది.

కోలీవుడ్ యంగ్ హీరో అయిన అధర్వ మురళీతో ఈమె ప్రేమలో ఉందని కొంతకాలం రూమర్స్ వచ్చాయి.

తర్వాత సీనియర్ హీరో కార్తీక్‌ కొడుకు గౌతమ్‌తో కూడా ప్రియా ఆనంద్‌ ప్రేమాయణం నడిపిందని, అధర్వకు బ్రేకప్ చెప్పేసింది అంటూ ప్రచారం జరిగింది.త్వరలోనే గౌతమ్ ను ప్రియా ఆనంద్ పెళ్లి జరగనుంది అంటూ గాసిప్స్ వచ్చాయి.

ఈ వార్తల పై ప్రియా ఆనంద్ స్పందించింది.నేను ప్రస్తుతం ఎవరితోనూ ప్రేమలో లేను.

గౌతమ్, అధర్వలు నాకు బెస్ట్ ఫ్రెండ్స్.మేం ముగ్గురం రెగ్యులర్ గా కలుసుకుంటూ ఉంటాము.మా పర్సనల్ విషయాలను షేర్ చేసుకుంటాము.అంతేతప్ప మరేమీ లేదు అంటూ చెప్పుకొచ్చింది ప్రియా ఆనంద్.వాళ్ళతో కలిసినంత మాత్రాన ప్రేమ అంటూ ప్రచారం చేసేస్తారా అంటూ ప్రియ మీడియాపై సీరియస్ అయ్యింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube