విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో షాకిచ్చిన కేంద్రం.. ఎక్కడా తగ్గడం లేదుగా.. ?

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో ఏపీ ప్రజల ఆసలు అడియాసలు అయ్యాయి.ఈ అంశం పై ఎక్కడా తగ్గని కేంద్రం వాతలు పెట్టడానికే సిద్దం అయ్యిందట.

 Privatization Of Visakhapatnam Steel Plant Central Govt Key-TeluguStop.com

అంటే ఎక్కువగా విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేసే వైపే అడుగులు వేస్తుందట.అదీగాక ఏపీకి ఈ విషయంలో షాకిస్తూ, విశాఖ స్టీల్ ప్లాంట్ లో రాష్ట్రానికి ఈక్విటీ షేర్ లేదని, 100% పెట్టుబడులు ఉపసంహరిస్తున్నట్లు ప్రకటించింది.

ఇక ఈ అంశం పై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ, మెరుగైన ఉత్పాదకత కోసమే స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేస్తున్నట్లు వెల్లడించింది.ఇకపోతే ఈ స్టీల్ ప్లాంట్ విషయంలో కార్మికులతో సహా స్దానికులు కూడా ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే.

 Privatization Of Visakhapatnam Steel Plant Central Govt Key-విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో షాకిచ్చిన కేంద్రం.. ఎక్కడా తగ్గడం లేదుగా.. -Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

దీనికి పలువురు రాజకీయ నేతలతో పాటుగా అధికార పార్టీ నాయకులు కూడా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నారు.కానీ చీమకుట్టినట్లుగా కూడా చలించని కేంద్రం చివరికి స్టీల్ ప్లాంట్ ను, ప్రైవేటీకరణ చేసేందుకు దాదాపుగా సిద్దం అయినట్లేనన్న ప్రచారం జరుగుతుంది.

అదీగాక జగన్ ప్రభుత్వంతో ఇప్పటికే ఈ అంశం పై సంప్రదింపులు జరిపినట్లు, అవసరమైనప్పుడు మద్దతు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరినట్లు నిర్మలా సీతారామన్ పేర్కొనడంతో, ఇక స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఎవరు ఆపలేరని అర్ధం అవుతుంది.

#Visakhapatnam #Central Govt #Privatization #CentralGovt #Comments

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు