ప్రైవేటు పాఠశాల వార్డెన్ దారుణం.. విద్యార్ధి ని కౄరంగా.. ?  

private schoolwarden is cruel mahabubabad, Private school, warden, cruel , beat student ,hostel varden ,mahabubabad ,krupakar , - Telugu Beat Student, Cruel, Mahabubabad, Private School, Warden

చదువుకునే విద్యార్ధుల పట్ల సక్రమంగా వ్యవహరించవలసిన బాధ్యత స్కూల్ ఉపాధ్యాయులకు, అందులో పనిచేసే వారికి ఉంది.కానీ కొందరు తమ బాధ్యతను మరచి విద్యార్ధుల పట్ల కౄరంగా జంతువుల్లా ప్రవర్తిస్తున్నారు.

TeluguStop.com - Private School Warden Is Cruel

ఇలాంటి ఘటనలు నిత్యం ఏదో ఒకచోట జరుగుతూనే ఉంటాయి.

ప్రస్తుతం మహబూబాబాద్ జిల్లాలోని ఓ ప్రైవేటు పాఠశాలలో కూడా ఇలాంటి కిరాతకం చోటు చేసుకుంది.

TeluguStop.com - ప్రైవేటు పాఠశాల వార్డెన్ దారుణం.. విద్యార్ధి ని కౄరంగా.. -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

ఇక్కడున్న ప్రైవేట్ స్కూల్లో చదువుతున్న కృపాకర్ అనే విద్యార్థిని ఆ స్కూల్ వార్డెన్ విచక్షణ రహితంగా కొట్టాడట.దీంతో ఆ విద్యార్థి కనుచూపును కోల్పోయాడట.

కాగా ఈ దారుణాన్ని ఆ విద్యార్థి తండ్రి పాఠశాల యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లిన వారినుండి ఎలాంటి స్పందనలేదట.దాంతో భాదితులు తెలంగాణ వినియోగదారుల సహాయ కేంద్రానికి ఫిర్యాదు చేయగా, కన్సుమర్ ఫోరం ఇరువర్గాలను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చిందట.

అంతే కాకుండా విద్యార్ధి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని రాక్షసంగా వ్యవహరించిన వార్డెన్‌కు 11,50,000 రూపాయలు పరిహారంగా చెల్లించాలని ఆదేశించిందట.కాగా వినియోగదారుల ఫోరమ్ ఆదేశాలతో భాదితులకు ఈ మొత్తాన్ని పరిహారంగా ప్రైవేటు పాఠశాల యాజమాన్యం ముట్టచెప్పిందట.

#Beat Student #Cruel #Warden #Mahabubabad #Private School

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు