కరోనా వైరస్ కి చికిత్స అంటూ ఏకంగా 16 లక్షలు బిల్లు....

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ ఎంతగా విలయ తాండవం చేస్తుందో పెద్దగా చెప్పనవసరం లేదు.దీంతో కొన్ని ఆసుపత్రి సంస్థలు ఈ విషయాన్ని క్యాష్ చేసుకునే పనిలో పడ్డాయి.

 Private Hospital, Corona Treatment, 16 Lakhs Rupees, Mumbai News, Crime News, He-TeluguStop.com

తాజాగా ఓ వ్యక్తి తన తండ్రిని కరోనా వైరస్ సోకడంతో వెంటనే దగ్గరలో ఉన్నటువంటి ఆస్పత్రిలో చేర్పించాడు.దీంతో ఇదే అదునుగా భావించినటువంటి ఆసుపత్రి సిబ్బంది బాధితుడికి చికిత్స అందించే నెపంతో ఏకంగా 16 లక్షల బిల్లును బాధితుడి కొడుక్కి పంపించారు.

అయితే ఇంత మొత్తంలో సొమ్ము ఖర్చు పెట్టినప్పటికీ బాధితుడు కోలుకోలేక మరణించాడు.ఈ విషయం దేశ ఆర్థిక రాజధాని అయినటువంటి ముంబై నగరంలో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే స్థానిక ప్రాంతంలో ఓ యువకుడు తన తల్లిదండ్రులతో కలిసి నివాసముంటున్నాడు.అయితే ఇతడు తండ్రి వయసు మీద పడడంతో గత కొద్దికాలంగా అనారోగ్య సమస్యలతో సతమతం అవుతున్నాడు.

అయితే తాజాగా అతడికి కరోనా వైరస్ లక్షణాలు కనిపించడంతో వెంటనే యువకుడు తన తండ్రిని దగ్గరలో ఉన్నటువంటి ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.అయితే ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది.

కానీ కరోనా వైరస్ కి చికిత్స చేస్తున్నామని నెపంతో ఆసుపత్రి సిబ్బంది దాదాపుగా 16 లక్షల రూపాయలు రోగికి చార్జ్ చేసినట్లు బాధితుడి కొడుకు వాపోతున్నాడు.అంతేగాక దాదాపుగా 16 లక్షలు కట్టినప్పటికీ తన తండ్రిని బతికించే లేక పోయారని యువకుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.

అయితే తాజాగా ఈ విషయంపై ఆసుపత్రి వైద్య సిబ్బంది స్పందించారు.ఇందులో భాగంగా తమ ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం చేరకముందే యువకుడి తండ్రి పలు రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని, అంతేగాక కిడ్నీ, కాలేయం గుండె సంబంధిత వ్యాధులతో బాధ పడుతున్నాడని, కాబట్టి అలాంటి వ్యాధులకు చికిత్స అందించాలంటే ఎక్కువ మొత్తంలో డబ్బు ఖర్చు అవుతుందని చెప్పుకొచ్చారు.

అంతేగాని తాము ఎటువంటి ఇతర అదనపు ఛార్జీలు మోపలేదని వివరణ ఇస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube