ఈటెలకు మద్దతుగా కదులుతున్న ప్రైవేట్ ఉద్యోగులు..అసలు వ్యూహం ఇదే?

ఈటెల వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో ఎంతలా సంచలనం సృష్టించిందో మనకు తెలిసిందే.భూ కబ్జా ఆరోపణలపై ఈటెలను భర్తరఫ్ చేసిన కేసీఆర్ ఆ తరువాత తక్షణ విజిలెన్స్ విచారణకు ఆదేశించారు.

 Private Employees Supports Etela Rajender, Etela Rajender, Lic Employees, Land-TeluguStop.com

అయితే ఇక ఆ తరువాత ఈటెలకు కేసీఆర్ కు మధ్య రాజకీయ ప్రచ్చన్న యుద్ధం జరిగిన విషయం తెలిసిందే.అయితే కేసీఆర్ ఈటెల రాజేందర్ ను తన నియోజకవర్గంలో ఒంటరిని చేయాలని అనుకున్న తరుణంలో మంత్రి గంగులను రంగంలోకి దింపి కార్యకర్తలతో భేటీ పేరుతో సరికొత్త రాజకీయానికి తెరదీసాడని చెప్పవచ్చు.

అయితే కేసీఆర్ హుజురాబాద్ రాజకీయాన్ని నడిపిస్తుండగా ఈటెలకు మద్దతుగా రాజకీయాలతో సంబంధం లేని నాయకులు ఈటెల వెంట మేమున్నామని నడుస్తున్న పరిస్థితి ఉంది.తాజాగా ఎల్ఐసీ ఉద్యోగులు మాజీ మంత్రి ఈటెలను కలిసి వారి మద్దతును తెలియజేశారు.

అంతేకాక వీణవంక ఎంపీపీ తిరుపతి రెడ్డి కూడా ఈటెల వెంట నడుస్తానని ఇప్పటికే ప్రకటించారు.దీంతో హుజురాబాద్ లో ఒక నిశ్శబ్ద విప్లవం మొదలైందని చెప్పవచ్చు.

అందుకే మంత్రి గంగుల విమర్శల దాడి పెంచుతున్నాడని చెప్పవచ్చు.అయితే కేసీఆర్ హుజూరాబాద్ పై వ్యూహాలు రచిస్తుండడంతో ఈటెల కూడా అత్యంత జాగ్రత్తగా జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్నాడు.

ఏ మాత్రం పట్టు తప్పినా ఈటెల భారీ మూల్యం చెల్లించుకునే పరిస్థితి ఉంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube