యూకే కొత్త ఇమ్మిగ్రేషన్ రూల్స్: విదేశీ నేరస్థులకు తలుపులు క్లోజ్, కాదని అడుగుపెడితే..!!  

Priti Patel to ban foreign criminals from UK, Priti Patel,UK, Home Secretary Priti Patel , new immigration rules - Telugu Home Secretary Priti Patel, New Immigration Rules, Priti Patel, Priti Patel To Ban Foreign Criminals From Uk, Uk

ప్రపంచంలోని వివిధ దేశాలకు చెందిన నేరస్తులంతా తప్పించుకోవడానికి యూకే బాట పడుతున్నారు.దీంతో విదేశీ నేరస్తులకు యూకే స్వర్గధామంగా మారింది.

 Priti Patel Ban Foreign Criminals Rules

ఉదాహరణకు మనదేశానికి చెందిన ఆర్ధిక నేరగాళ్లు విజయ్ మాల్యా, నీరవ్ మోడీ తదితరులు లండన్‌లో ఉన్నారు.వీరిని భారతదేశానికి రప్పించేందుకు మన దర్యాప్తు సంస్థలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి.

అయితే విదేశీ నేరస్తులకు తమ దేశం అడ్డాగా మారిపోవడంతో యూకే ప్రభుత్వం ఈ అపవాదును తప్పించుడానికి నడుంబిగించింది.ఈ క్రమంలో ఏడాదికి పైగా జైలు శిక్ష అనుభవిస్తున్న విదేశీ నేరస్తులు దేశంలో అడుగుపెట్టకుండా నిషేధం విధించింది.

యూకే కొత్త ఇమ్మిగ్రేషన్ రూల్స్: విదేశీ నేరస్థులకు తలుపులు క్లోజ్, కాదని అడుగుపెడితే..-Telugu NRI-Telugu Tollywood Photo Image

జనవరి 1 నుంచి అమల్లోకి రానున్న పాయింట్ బేస్డ్ సిస్టమ్ వివరాలను యూకే హోంశాఖ కార్యదర్శి ప్రీతి పటేల్ సోమవారం తెలపనున్నారు.ఈ కొత్త నిబంధనలు ప్రపంచంలోని ఇతర ప్రాంతాల వారితో పాటే ఈయూ పౌరులకు సైతం వర్తిస్తాయి.

కొత్త ఇమ్మిగ్రేషన్ విధానం ప్రకారం బ్రిటన్‌లోకి ప్రవేశించే తక్కువ నైపుణ్యం కలిగిన వలసదారుల సంఖ్యను పరిమితం చేయడానికి రూపొందించబడింది.అయితే అధిక నైపుణ్యం కలిగిన కార్మికులకు యూకే వీసాలు పొందడం సులభతరం చేయడమే ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.యూకేలో నివాసం, పనిచేయాలనుకునే వ్యక్తులు వీసా కోసం దరఖాస్తు చేసుకోవాలంటే 70 పాయింట్లు పొందాలి.నిర్దిష్ట స్థాయిలో ఇంగ్లీష్ మాట్లాడటం, యజమాని నుంచి ఆఫర్ లెటర్, కనీస వేతన పరిమితిని పాయింట్ల కింద పరిగణనలోనికి తీసుకుంటారు.

#Priti Patel #Uk

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Priti Patel Ban Foreign Criminals Rules Related Telugu News,Photos/Pics,Images..